Do you know why the watch is worn only on the left hand? This is the special reason. - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

Do you know why the watch is worn only on the left hand? This is the special reason.

24_02

 Do you know why the watch is worn only on the left hand? This is the special reason.

గడియారం ఎడమ చేతికి మాత్రమే ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..? ఆ ప్రత్యేక కారణం ఇదేనట.!

Do you know why the watch is worn only on the left hand? This is the special reason.

వాచీని ఏ చేతికి పెట్టుకోవాలనేది అందరి ఆసక్తి. ఇది ఒకరి సౌకర్యాల స్థాయిపై కూడా ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఈ వాచీని కుడి చేతికి కూడా ధరిస్తారు. ప్రధాన కారణం ఆ వ్యక్తులు ఎడమ చేతివాటం కలిగిన వారై ఉంటారు. కుడి చేతికి బదులుగా ఎడమ చేతికి గడియారాన్ని ధరించడానికి మరొక కారణం కూడా ఉంది.. ఎందుకంటే మీ వాచ్ సురక్షితంగా ఉంటుంది. ఇది రంగు మారడం, విరిగిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందువల్ల, చాలా వరకు వాచ్ తయారీ కంపెనీలు ఎడమ చేతిని దృష్టిలో ఉంచుకుని వాచీలను తయారు చేస్తాయి. మరోవైపు వాచీని ఎడమ మణికట్టుకు పెట్టుకుంటే సమయం తెలుసుకోవటంలో ఇబ్బంది ఉండదు. అలాగే, కుడి చేతితో పని చేస్తున్నప్పుడు కూడా మీరు వాచ్‌లో సమయాన్ని చూసుకోవచ్చు.

చాలా మంది తమ కుడి చేతితోనే అన్ని పనులు చేస్తుంటారు. దాంతో మీ కుడి చేయి ఎక్కువ వరకు బిజీగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో కుడి మణికట్టుకు గడియారం పెట్టుకున్నట్టయితే.. అది టైమ్‌ చూసుకోవటంలో ఇబ్బందిని కలిగిస్తుంది. ఇది మీ పనికి కూడా అడ్డంకిగా మారుతుంది.

మన దగ్గర ఎక్కువ మంది వాచీని ఎడమ చేతి మణికట్టుకు ధరిస్తారు. మరికొందరు మాత్రం కుడి మణికట్టుకు కూడా పెట్టుకుంటారు. కానీ చాలా మంది ఎడమ చేతికి వాచీ పెట్టుకుంటారు. దీని వెనుక ప్రత్యేక కారణం ఉంది. ఈ రోజుల్లో బట్టలు, హెయిర్ స్టైల్, షూస్ తో పాటు రిస్ట్ వాచ్ కూడా మన స్టైల్ లో భాగమైపోయింది. టైమ్‌ తెలుసుకోవడానికి చేతి గడియారం ఉపయోగించబడుతుంది. కానీ ఇది మీ రూపాన్ని మరింతగా మెరుపరుస్తుంది. వాచీని ఏ చేతికి పెట్టుకున్నామనేది వారి కంఫర్ట్ లెవెల్ మీద కూడా ఆధారపడి ఉంటుంది.