March Bank Holidays Explanation of how many days banks are open in March - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

March Bank Holidays Explanation of how many days banks are open in March

24_02

 March Bank Holidays Explanation of how many days banks are open in March

March Bank Holidays మార్చిలో బ్యాంకులు ఎన్ని రోజులు పని చేస్తాయో వివరణ.

March Bank Holidays Explanation of how many days banks are open in March

 ఐదు రోజుల్లో మరో నెల చరిత్ర గర్భంలో కలిసిపోనున్నది. వచ్చే శుక్రవారం నుంచి 2024 మార్చి నెలాఖరు ప్రారంభం కానున్నది. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆర్థిక లావాదేవీల నిర్వహణకు బ్యాంక్ ఖాతాలు నిర్వహిస్తున్నారు.

ఇప్పుడంతా డిజిటల్ చెల్లింపులే జరుగుతున్నా, కొన్ని సందర్భాల్లో ఖాతాదారులు బ్యాంకు శాఖలను సంప్రదించడం తప్పనిసరి. ఈ పరిస్థితుల్లో మార్చిలో 31 రోజుల్లో 14 రోజులు బ్యాంకులకు సెలవు. ఐదు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారంతోపాటు మరో ఏడు రోజులు బ్యాంకులకు ఆర్బీఐ సెలవులు ప్రకటించింది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం మార్చి 1,8,22,25,26,27, 29 తేదీల్లో బ్యాంకులకు సెలవులు. 3, 10, 17,24, 31 తేదీల్లో ఐదు ఆదివారాలు, 9,23 తేదీల్లో రెండో, నాలుగో శనివారాలు బ్యాంకులకు సెలవు దినాలు.

బ్యాంకులకు సెలవుల వివరాలు:

మార్చి 1 – మిజోరంలో చాప్ చార్ కుట్ సందర్భంగా బ్యాంకులకు సెలవు

మార్చి 3- ఆదివారం

మార్చి 8 – మహా శివరాత్రి సందర్భంగా కొన్ని రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా సెలవు

మార్చి 9 – రెండో శనివారం

మార్చి 10- ఆదివారం

మార్చి 17 – ఆదివారం

మార్చి 22 – బీహార్ దివస్ సందర్భంగా బీహార్ లో బ్యాంకులు పని చేయవు.

మార్చి 23- నాలుగో శనివారం

మార్చి 25- హోలీ సందర్భంగా కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్, బీహార్, శ్రీనగర్ మినహా దేశమంతా సెలవు

మార్చి 26- హోలీ రెండో రోజు సందర్భంగా ఒడిశా, మణిపూర్, బీహార్ రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు

మార్చి 27- హోలీ సందర్భంగా బీహార్ రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

మార్చి 20- గుడ్ ఫ్రైడే సందర్భంగా త్రిపుర, అసోం, రాజస్థాన్, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.