PM Kisan: Didn't you get PM Kisan money..? Complain like this! - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

PM Kisan: Didn't you get PM Kisan money..? Complain like this!

24_02

 PM Kisan: Didn't you get PM Kisan money..? Complain like this!

PM Kisan: మీకు పీఎం కిసాన్‌ డబ్బులు అందలేదా..? ఇలా ఫిర్యాదు చేయండి!

PM Kisan: Didn't you get PM Kisan money..? Complain like this! PM Kisan: మీకు పీఎం కిసాన్‌ డబ్బులు అందలేదా..? ఇలా ఫిర్యాదు చేయండి!

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 16వ విడతను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని యవత్మాల్‌లో రిమోట్ బటన్‌ను నొక్కడం ద్వారా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. 9 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలకు డబ్బులు బదిలీ అయ్యాయి. అయితే చాలా మందికి ఈ 16వ విడత రాలేదు. కొందరికి కాస్త ఆలస్యం కావచ్చు. మీరు స్కీమ్‌లో నమోదు చేసుకున్నప్పటికీ డబ్బు అందకపోతే, వివిధ కారణాలు ఉండవచ్చు. అందులో ప్రధాన కారణం కేవైసీ అప్‌డేట్ కాకపోతే లేదా కేవైసీ రికార్డ్ సరిగ్గా సరిపోలకపోతే డబ్బు రాకపోవచ్చు. మీరు పథకం లబ్ధిదారుగా ఈకేవైసీ చేసినప్పటికీ, డబ్బు అందకపోతే ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంది. ఫిర్యాదు చేసేందుకు మీకు హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంటుంది. హెల్ప్‌లైన్ నంబర్‌లు ఉన్నాయి. అలాగే పీఎం కిసాన్ పోర్టల్ pmkisan.gov.in/ కి వెళ్లి కూడా ఫిర్యాదు చేయవచ్చు.

ఫిర్యాదు చేయడం ఎలా?

ఇమెయిల్ ID: pmkisan-ict@gov.in, pmkisan-funds@gov.in

PM కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్: 155261 / 011-24300606

PM కిసాన్ టోల్ ఫ్రీ నంబర్: 1800-115-526

పోర్టల్‌లో లింక్: pmkisan.gov.in/Grievance.aspx

మీరు ఇక్కడ పోర్టల్‌లో పై ఫిర్యాదు పేజీని తెరిస్తే, మీ ఆధార్ నంబర్ లేదా ఖాతా నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, ‘వివరాలను పొందండి’పై క్లిక్ చేయండి.

పీఎం కిసాన్‌ డబ్బులు రాకపోవడానికి కారణాలు ఏమిటి?

  • బ్యాంకు ఖాతా స్తంభించి ఉండవచ్చు
  • బ్యాంక్ ఖాతా డియాక్టివేట్ కావచ్చు
  • ఖాతాదారు చనిపోయి ఉండవచ్చు
  • ఆధార్ డియాక్టివేట్ కావచ్చు
  • బ్యాంక్ ఖాతా తప్పుగా నమోదు చేయబడి ఉండవచ్చు
  • బ్యాంక్ ఖాతా యొక్క IFSC కోడ్ తప్పుగా ఉండవచ్చు

EKYC తప్పనిసరి:

మీరు పీఎం కిసాన్ యోజనలో ఈకేవైసీని అప్‌డేట్ చేయకుంటే డబ్బులు పొందలేరు. ప్రభుత్వం ఇప్పటికే తగినంత గడువు ఇచ్చింది. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కి వెళ్లడం ద్వారా ఈకేవైసీని సులభంగా సమర్పించవచ్చు. రైతు సంప్రదింపు కేంద్రానికి వెళ్లి కూడా ఆధార్ పత్రాన్ని ఇవ్వడం ద్వారా కేవైసీ అప్‌డేట్‌ చేస్తారు.