UPSC IFS 2024 : 150 Jobs in Forest Department. - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

UPSC IFS 2024 : 150 Jobs in Forest Department.

24_02

 UPSC IFS 2024 : 150 Jobs in Forest Department.

UPSC IFS 2024 : అటవీ శాఖలో 150 ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల.. ఉండాల్సిన అర్హతలివే

ప్రధానాంశాలు:

  • ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌-2024 నోటిఫికేషన్‌.
  • మొత్తం 150 పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ.
  • మార్చి 5 దరఖాస్తులకు చివరితేది.
UPSC IFS 2024 : 150 Jobs in Forest Department. UPSC IFS 2024 : అటవీ శాఖలో 150 ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల.. ఉండాల్సిన అర్హతలివే

UPSC IFS Notification 2024 : ఐఏఎస్, ఐపీఎస్‌ల మాదిరిగానే ఉండే మరో ఆల్‌ ఇండియా సర్వీస్‌ ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (IFS). కేంద్ర అటవీ శాఖ పరిధిలోని ఈ సర్వీస్‌కు కూడా యూపీఎస్సీనే ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తుంది. ఏటా ఐఎఫ్‌ఎస్‌ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. తాజాగా UPSC IFS Notification 2024 విడుదలైంది. మొత్తం 150 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.upsc.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ముఖ్య సమాచారం :

అర్హతలు : యానిమల్‌ హజ్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీల్లో కనీసం ఒక సబ్జెక్టుతో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా అగ్రికల్చర్‌/ ఫారెస్ట్రీలో బ్యాచిలర్‌ డిగ్రీ (లేదా) ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు : ఆగస్ట్‌1, 2024 నాటికి 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు లభిస్తుంది.

ఎంపిక ప్రక్రియ : ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌లో అభ్యర్థుల ఎంపికకు మూడంచెల ఎంపిక విధానాన్ని అనుసరిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్‌/పర్సనల్‌ ఇంటర్వ్యూలు ఉంటాయి.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య సమాచారం:

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 5, 2024.

దరఖాస్తుల సవరణ అవకాశం: మార్చి 6- 12 వరకు.

యూపీఎస్సీ ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీ: మే 26, 2024.

మెయిన్‌ ఎగ్జామినేషన్‌: నవంబర్‌ 24 నుంచి ఏడు రోజుల పాటు నిర్వహిస్తారు.

Important Links:

FOR  WEBSITE  CLICKHERE.

FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE