AP DSC Exams 2024: AP DSC Exams Postponed Govt.. New Exam Dates Are These - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

AP DSC Exams 2024: AP DSC Exams Postponed Govt.. New Exam Dates Are These

24_03

 AP DSC Exams 2024: AP DSC Exams Postponed Govt.. New Exam Dates Are These

AP DSC Exams 2024: ఏపీ DSC పరీక్షలు వాయిదా వేసిన ప్రభుత్వం.. కొత్త పరీక్ష తేదీలు ఇవే

ఏపీ డీఎస్సీ పరీక్షల కొత్త షెడ్యూల్‌.

AP DSC Exams 2024: AP DSC Exams Postponed Govt.. New Exam Dates Are These AP DSC Exams 2024: ఏపీ DSC పరీక్షలు వాయిదా వేసిన ప్రభుత్వం.. కొత్త పరీక్ష తేదీలు ఇవే ఏపీ డీఎస్సీ పరీక్షల కొత్త షెడ్యూల్‌.

AP DSC New Schedule 2024 : ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే AP DSC 2024 పరీక్షల‌కు సంబంధించి షెడ్యూల్ విషయంలో పాఠశాల విద్యాశాఖ మార్పులు చేసింది. ఉపాధ్యాయ నియామక పరీక్షలు (AP DSC) మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 30 వరకూ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ తెలిపారు. ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య గడువు విషయంపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు విద్యాశాఖ కొత్త షెడ్యూల్ (AP DSC New Schedule 2024) ప్రకటించింది. ఫలితంగా మార్చి 30 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు ఏపీ విద్యాశాఖ తెలిపింది. ఏప్రిల్‌ 30 వరకు ఈ పరీక్షలు ఉంటాయని పేర్కొంది. అయితే.. మార్చి 20 నుంచి పరీక్ష కేంద్రాల ఎంపికకు అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 25 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పిస్తారు.

ఏపీలో టెట్ పరీక్షలు (AP TET Exams 2024) ముగిసిన వెంటనే డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నారని.. దీంతో ప్రిపేర్ అయ్యేందుకు అభ్యర్థులకు తగిన సమయంలేదని కొందరు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో అభ్యర్థులు ఒత్తిడికి లోనవుతున్నారని కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్లపై వాదనలు ఉన్న హైకోర్టు..టెట్, టీఆర్టీ మధ్య నాలుగు వారాలు గడువు ఉండేలా పరీక్షలు షెడ్యూల్ చేయాలని మార్చి 4వ తేదీన ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.

AP DSC New Schedule 2024 ఇదే :

  • మార్చి 30వ తేదీ నుంచి ఏపీ డీఎస్సీ పరీక్షలు ప్రారంభమవుతాయి
  • ఏప్రిల్‌ 30 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.
  • రోజుకు 2 సెషన్ల చొప్పున 10 సెషన్లలో ఎస్జీటీ పరీక్షలు నిర్వహించనున్నారు.
  • ఏప్రిల్‌ 7న టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్‌ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్‌ ప్రొఫీషియన్సీ టెస్టు నిర్వహిస్తారు.
  • ఏప్రిల్‌ 13 నుంచి ఏప్రిల్‌ 30 వరకూ స్కూల్‌ అసిస్టెంట్‌, టీజీటీ, పీజీటీ, వ్యాయామ డైరెక్టర్‌, ప్రిన్సిపల్‌ పోస్టులకు పరీక్షలు ఉంటాయి.
  • మార్చి 20 నుంచి అభ్యర్థులకు సెంటర్లు ఎంచుకోవడానికి వెబ్‌ ఆప్షన్లు ఇస్తారు.
  • మార్చి 25 నుంచి అభ్యర్థులు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.