Funds in farmers' accounts on 24th - changes in eligibility, for whom..!!
24న రైతుల ఖాతాల్లో నిధులు - అర్హతల్లో మార్పులు, వీరికే..!!
రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 24న రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నా యి. ప్రధాని మోదీ పీఎం కిసాన్ సమ్మాన్ యోజన 19వ విడత నిధులను విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసారు. 24న ప్రధాని బీహార్ లోని భాగల్పూర్ లో అర్హులైన రైతుల ఖాతాల్లో రూ 2వేలు చొప్పున విడుదల చేయనున్నారు. ఈ విడతలో దాదాపుగా 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.
ఖాతాల్లో నిధులు
ప్రధాని మోదీ ఈ నెల 24న బీహార్ లో 19వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ యోజన నిధులను విడుదల చేయనున్నారు. ప్రధాని మోదీ ఈ పథకాన్ని 2019 లో ప్రారంభించారు. ప్రతీ ఏటా రైతు లకు రూ 6 వేలు పెట్టుబడి సాయంగా అందిస్తున్నారు. రూ 6 వేలను మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ప్రతీ నాలుగు నెలలకు రూ 2 వేలు చొప్పున ఈ నిధులను ప్రతీ ఏటా అందిస్తున్నారు. ఏప్రిల్ నుండి జూలై వరకు, ఆగస్టు నుండి నవంబర్ వరకు, డిసెంబర్ నుండి మార్చి వరకు రైతుల ఖాతాలకు నేరుగా డబ్బును రైతుల ఖాతాల్లోకి జమ చేస్తోంది.
ఈ కేవైసీ తప్పనిసరి
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనం దక్కాలంటే ఈ-కేవైసి ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం రైతులకు సూచిస్తోంది. ఈ-కేవైసి పూర్తి చేసిన రైతులకు మాత్రమే ఈ విడత నిధులు జమ అవుతాయని అధికారులు వెల్లడించారు. ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి రైతులు భూమి ధృవీకరణ చేయించుకోవడం తప్పనిసరి. ఈ-కెవైసి చేయించుకోని లేదా భూమి ధృవీకరణ చేయించుకోని రైతులు ఈ వాయిదా నిధులు జమ కావని చెబుతున్నారు.
హెల్ప్ లైన్
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, లబ్ధిదారులకు ఆర్థిక సాయం నేరుగా వారి ఆధార్-లింక్డ్ బ్యాం క్ ఖాతాల్లోకి చేరేలా చూసుకోవడానికి ప్రభుత్వం ఈ-కేవైసి తప్పనిసరి చేసింది. పీఎం కిసాన్ యోజ న గురించి ఏదైనా తెలుసుకోవాలంటే హెల్ప్‌లైన్ నంబర్ 155261కు కాల్ చేయవచ్చని అధికారులు వెల్లడించారు.