SECURED VS UNSECURED PERSONAL LOANS - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

SECURED VS UNSECURED PERSONAL LOANS

25_02

SECURED VS UNSECURED PERSONAL LOANS

పర్సనల్ లోన్స్ ఎన్ని రకాలు? ఏది సెలెక్ట్ చేసుకుంటే బెటర్?

సెక్యూర్డ్, అన్ సెక్యూర్డ్ రుణాలలో ఏది ఉత్తమం?

SECURED VS UNSECURED PERSONAL LOANS

Secured vs Unsecured Personal Loans : వ్యక్తిగత రుణాలు ప్రధానంగా రెండు రకాలు. మొదటి రకం సెక్యూర్డ్ రుణాలు. రెండో రకం అన్ సెక్యూర్డ్ రుణాలు. వీటిలో ఏ రకం రుణానికి దరఖాస్తు చేయాలో అర్థం కాక, గందరగోళానికి గురవుతున్నారా? అయితే మీరు తప్పకుండా సెక్యూర్డ్, అన్ సెక్యూర్డ్ రుణాల మధ్యనున్న తేడాల గురించి తెలుసుకోవాలి. ఏ రుణం ఎలాంటిదనే దానిపై ఒక అభిప్రాయానికి రావాలి. ఆ వివరాలను చూద్దాం.

కొన్ని బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు(NBFCs) పూచీకత్తు లేకుండానే వ్యక్తిగత రుణాలను మంజూరు చేస్తుంటాయి. ఇంకొన్ని మాత్రం పూచీకత్తు లేనిదే రుణం ఇవ్వడం కుదరదని తేల్చి చెబుతుంటాయి. వీటిలో దేన్ని ఎంపిక చేసుకోవాలి ? అనేది మీ నిర్ణయమే. చాలామందికి పూచీకత్తు ఇచ్చేవారు ఉండరు. దీనివల్ల వాళ్లు వ్యక్తిగత రుణాలను తీసుకోలేకపోతుంటారు. ఇలాంటి వాళ్లు పూచీకత్తు లేకుండా రుణాలిచ్చే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలను వెతుక్కోవాలి. ఇంతకీ సెక్యూర్డ్, అన్ సెక్యూర్డ్ రుణాలు ఏమిటో తెలుసుకుందాం..

అన్ సెక్యూర్డ్ రుణాలు అంటే?

అన్ సెక్యూర్డ్ వ్యక్తిగత రుణాలను మనం పూచీకత్తు లేకుండానే పొందొచ్చు. సిబిల్ స్కోర్, ఇతరత్రా అర్హతలు, ఆర్థిక సామర్థ్యం, ఉద్యోగ స్థాయి, వయసు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ రకం రుణాన్ని మంజూరు చేస్తుంటారు. ఆస్తులను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేకుండానే ఈ రుణాన్ని పొందొచ్చు. పూచీకత్తు ఇచ్చేవారి కోసం వెతుక్కుంటూ తిరగాల్సిన పని ఉండదు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఇస్తున్నారు కాబట్టే దీన్ని ‘అన్ సెక్యూర్డ్ లోన్’ అంటారు. ఈ రకం రుణాన్ని మంజూరు చేయడం వల్ల బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీకి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రుణంపై ఎక్కువ వడ్డీరేటును వసూలు చేస్తారు. దరఖాస్తుదారుడి క్రెడిట్ స్కోరుతో పాటు అతడి బ్యాంకు ఖాతాలోకి వేతనం స్థిరంగా ప్రతినెలా అందుతుందా ? లేదా ? అనేది తప్పకుండా పరిశీలిస్తారు. వెరిఫికేషన్ కోసం గత ఆరు నెలల బ్యాంకు స్టేట్‌మెంట్లను సమర్పించమని బ్యాంకు అధికారులు అడుగుతారు. స్థిరాస్తులు లేని వారు అత్యవసరాల్లో అన్ సెక్యూర్డ్ లోన్ తీసుకోవచ్చు.

సెక్యూర్డ్ రుణాలు అంటే?

సెక్యూర్డ్ రుణాలు కేవలం పూచీకత్తుతో లభిస్తాయి. ఆస్తులు తాకట్టు పెట్టి కూడా ఈ రకం లోన్స్ తీసుకోవచ్చు. ఇల్లు, కారు, భూమి వంటి వాటిని తాకట్టు పెట్టొచ్చు. లోన్ అమౌంట్ సాధ్యమైనంత ఎక్కువగా ఉండాలంటే సెక్యూర్డ్ రుణాలేే ఉత్తమం. వీటిలో రుణాన్ని తిరిగి చెల్లించే వ్యవధి కూడా ఎక్కువగా లభిస్తుంది. ఇక ఇదే సమయంలో దరఖాస్తుదారుడి నెలవారీ ఆదాయాలు, క్రెడిట్ స్కోరును సైతం బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు పరిశీలిస్తాయి. సెక్యూర్డ్ రుణాలపై వడ్డీరేటు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ రకం లోన్‌లతో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు రిస్క్ తక్కువ. పూచీకత్తు ఇవ్వగలిగే సామర్థ్యమున్నా, ఆస్తులున్నా సెక్యూర్డ్ లోన్ తీసుకోవడం బెస్ట్.

సెక్యూర్డ్ లోన్ వర్సెస్ అన్ సెక్యూర్డ్ లోన్- ఏది ఎంచుకోవాలి ?

సెక్యూర్డ్ లోన్, అన్ సెక్యూర్డ్ లోన్‌లలో దేన్ని ఎంచుకోవాలి అనేది దరఖాస్తుదారుడి ఇష్టం. మీకు ఎంత రుణం అవసరం ? మీ ఆర్థిక స్థితి ఏమిటి ? అనే అంశాల ఆధారంగా రుణం రకాన్ని ఎంపిక చేసుకోవాలి. ఎక్కువ రుణం అవసరమై, ఆస్తులు ఉంటే సెక్యూర్డ్ లోన్ తీసుకోవచ్చు. తక్కువ రుణం అవసరమైన వారు అన్ సెక్యూర్డ్ లోన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. రుణం తిరిగి చెల్లించే వ్యవధి ఎక్కువగా ఉండాలన్నా, వడ్డీరేటు తక్కువగా ఉండాలన్నా సెక్యూర్డ్ లోన్ తీసుకోవడం బెటర్. క్రెడిట్ స్కోరు తక్కువగా ఉన్న వారికి, స్థిరమైన నెలవారీ ఆదాయం లేని వారికి సెక్యూర్డ్ రుణాలే ఉత్తమం.