Post Office: Security for your money and good income.. Post Office Scheme.. - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

Post Office: Security for your money and good income.. Post Office Scheme..

24_02

 Post Office: Security for your money and good income.. Post Office Scheme..

Post Office: మీ డబ్బుకు భద్రతతో పాటు మంచి ఆదాయం.. పోస్టాఫీస్‌ స్కీమ్‌..

Post Office: Security for your money and good income.. Post Office Scheme.. Post Office: మీ డబ్బుకు భద్రతతో పాటు మంచి ఆదాయం.. పోస్టాఫీస్‌ స్కీమ్‌..

ఉద్యోగ విరమణ తర్వాత లేదా వ్యాపారం నుంచి నిష్క్రమించిన తర్వాత ప్రతీ నెల గ్యారెంటీ ఆదాయం ఉంటే బాగుంటుందనే ఆలోచనలో చాలా మంది ఉంటారు. ఇలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టాఫీస్‌ ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా మీ డబ్బుకు భద్రత లభించడంతో పాటు ప్రతీ నెల స్థిరమైన ఆదాయాన్ని పొందొచ్చు. ఇంతకీ పోస్టాఫీస్‌ అందిస్తున్న ఈ పథకం పేరెంటి.? ఇందులో పెట్టుబడి పెడితే కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పోస్టాఫీస్‌ అందిస్తోన్న ఈ పథకం పేరు సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీమ్‌. ఇందులో మీ రిటైర్మెంట్ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పథకంలో భాగంగా మీఉ కనీసం 1000 రూపాయల్నించి నుంచి పెట్టుబడి పెట్టుకోవచ్చు. గరిష్టంగా రూ. 30 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. దీంతో ప్రతీ నెల ఖర్చులకు నిర్ధిష్ట మొత్తం డబ్బులు ఆదాయంగా పొందొచ్చు. అంతేకాదు ఈ పథకంలో పెట్టుబడిగా పెట్టిన మొత్తానికి ఇన్‌కంటాక్స్ చట్టం సెక్షన్ 80సి ప్రకారం మినహాయింపు కూడా లభిస్తుంది.

అయితే దీనిపై వచ్చే వడ్డీపై ట్యాక్స్ వర్తిస్తుంది. ప్రస్తుతం సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌పై ప్రభుత్వం 8.2 శాతం వడ్డీ ఇస్తోంది. కేంద్రం ఈ వడ్డీ రేటును సవరిస్తుంటుంది. ముఖ్యంగా 60 ఏళ్ల వృద్ధుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఉద్యోగ విరమణ తర్వాత డబ్బును సరిగ్గా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రతీ నెల వడ్డీ డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఉద్యోగవిరమణ తర్వాత ఆర్థిక అవసరాలకు ఎలాంటి ఢోకా ఉండదు. ఉదాహరణకు ఈ పథకంలో రూ. 30 పెట్టుబడి పెడితే నెలకు సుమారు రూ. 25 వేల వరకు వడ్డీ పొందొచ్చు.