TREIRB Results : Telangana youth got 3 government jobs while working as a watchman - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

TREIRB Results : Telangana youth got 3 government jobs while working as a watchman

24_03

 TREIRB Results : Telangana youth got 3 government jobs while working as a watchman

TREIRB Results : వాచ్‌మెన్‌ ఉద్యోగం చేస్తూనే.. 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన తెలంగాణ యువకుడు.

TREIRB Results : Telangana youth got 3 government jobs while working as a watchman TREIRB Results : వాచ్‌మెన్‌ ఉద్యోగం చేస్తూనే.. 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన తెలంగాణ యువకుడు.

TREIRB Results 2024 : కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదంటారు పెద్దలు. ఇది అక్షరాలా నిజం. పేదరికంలో పుట్టినా కృషి, పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించన వాళ్లు ఎందరో. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. వాచ్ మెన్ ఉద్యోగం చేస్తూనే .. ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు ఓ యువకుడు. ఎక్కడో కాదు మన తెలంగాణలోనే. వివరాల్లోకెళ్తే..

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొన్కల్ గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎడ్యుకేషనల్ మల్టీ మీడియా రీసెర్చ్ సెంటర్ (EMRC)లో రాత్రిపూట వాచ్ మెన్‌గా పనిచేస్తూ.. కేవలం 10 రోజుల వ్యవధిలోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు.

ఇటీవల తెలంగాణ సంక్షేమ గురుకుల విద్యాలయాల బోర్డు (TREIRB) ప్రకటించిన ఫలితాల్లో.. టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు సాధించాడు ప్రవీణ్. ఇతను ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకు జెన్నారంలో పూర్తి చేశాడు. ప్రవీణ్ తండ్రి పెద్దులు మేస్త్రీ పనిచేస్తుండగా.. తల్లి పోసమ్మ బీడీ కార్మికురాలిగా పనిచేస్తూ ప్రవీణ్‌ను చదివించారు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసిన ప్రవీణ్ ఉన్నత ఉద్యోగం సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఎంకాం, బీఈడీ, ఎంఈడీ ఓయూ క్యాంపస్‌లో పూర్తిచేశాడు.

అయితే.. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఖర్చుల కోసం EMRC లో ఐదేళ్లుగా వాచ్ మెన్‌ ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యాడు. అతని పట్టుదల, కష్టం ఫలించి ఒకే సారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ప్రవీణ్ సాధించిన ఈ ఘనత పట్ల EMRC డైరెక్టర్, ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేయడమే కాకుండా.. సన్మానించారు.