TS LAWCET 2024 : TS LAWCET 2024 notification released.. - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

TS LAWCET 2024 : TS LAWCET 2024 notification released..

24_03

 TS LAWCET 2024 : TS LAWCET 2024 notification released..

TS LAWCET 2024 : టీఎస్‌ లాసెట్ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

ప్రధానాంశాలు:

  • టీఎస్‌ లాసెట్‌ 2024 నోటిఫికేషన్‌.
  • మార్చి 1 నుంచి దరఖాస్తులు ప్రారంభం.
  • ఏప్రిల్‌ 15 దరఖాస్తులకు చివరితేది.
TS LAWCET 2024 : TS LAWCET 2024 notification released.. TS LAWCET 2024 : టీఎస్‌ లాసెట్ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

TS LAWCET PGLCET 2024 : తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు, ఐదేళ్ల లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS LAWCET 2024), తెలంగాణ పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS PGLCET-2024) నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఎల్‌ఎల్‌బీతో పాటు రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది ఈ పరీక్షను హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University) నిర్వహిస్తోంది. అర్హులైన అభ్య‌ర్థులు మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్‌ 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్‌ 3న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://lawcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

కోర్సులు: మూడు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులు, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.

అర్హత: మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులకు ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీ.. ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు ఇంటర్మీడియట్; ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

పరీక్ష మీడియం: లాసెట్ ఇంగ్లిష్/ తెలుగు, ఇంగ్లిష్/ ఉర్దూ; పీజీఎల్‌సెట్‌ ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: లాసెట్‌కు రూ.900 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.600).. పీజీఎల్‌సెట్‌కు రూ.1100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.900)గా నిర్ణయించారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, సిద్దిపేట, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, నర్సంపేట, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి, విజయవాడ తదితర ప్రదేశాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: మార్చి 1, 2024

దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్‌ 15, 2024

పరీక్ష నిర్వహణ తేదీ: జూన్‌ 3, 2024.

Important Links:

FOR  WEBSITE  CLICKHERE.

FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE