E-Aadhaar: Will there be a question mark on the Aadhaar card..? These are simple tips to validate signature
E-Aadhaar: ఆధార్ కార్డుపై క్వశ్చన్ మార్క్ వస్తుందా..? సిగ్నేచర్ వ్యాలిడేట్ చేయడానికి సింపుల్ టిప్స్ ఇవే.
భారతదేశంలో ప్రతి చిన్న అవసరానికి ఆధార్ కార్డు ఆధారంగా మారింది. అయితే పెరుగుతున్న జనాభా నేపథ్యంలో ప్రతి ఒక్కరి ఇంటికి ఆధార్ కార్డు చేరడం అసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ వెబ్‌సైట్ ద్వారా నిర్దిష్ట సూచనలను పాటించి ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే మన కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసి ప్రింట్ ఇస్తే అందులో క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. కానీ మీ సేవతో పాటు ఇతర నెట్ సెంటర్స్ కార్డును డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకుంటే మాత్రం టిక్ మార్క్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ టిక్ మార్క్ ఎలా సెట్ చేయాలో? నిపుణులు కొన్ని చనలు చేస్తున్నారు. ఆధార్ కార్డులో చెల్లుబాటు అయ్యే డిజిటల్ సంతకం మీ ఈ-ఆధార్‌ను ట్యాంపరింగ్ నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. అలాగే ప్రామాణికతకు కూడా హామీ ఇస్తుంది. అడోబ్ రీడర్‌ను ఉపయోగించి మీ ఈ-ఆధార్‌లోని డిజిటల్ సంతకాన్ని ధ్రువీకరించవచ్చు.
కాబట్టి అడోబ్ రీడర్‌తో డిజిటల్ సిగ్నేచర్‌ను ఎలా వ్యాలిడేట్ చేయాలో? ఓ సారి తెలుసుకుందాం.
- అడోబ్ రీడర్ ఉపయోగించి మీ డౌన్‌లోడ్ చేసిన ఈ-ఆధార్ పీడీఎఫ్‌ను తెరవాలి.
- మీ ఈ-ఆధార్‌లో సంతకం పక్కన ప్రదర్శించే “క్వశ్చన్ మార్క్”ను ఎంచుకోవలి.
- “చెల్లుబాటు తెలియదు” చిహ్నంపై రైట్ క్లిక్ చేయాలి.
- పాప్-అప్ మెనూ నుంచి ” సంతకాన్ని ధ్రువీకరించు ” ఎంచుకోవాలి.
- “సిగ్నేచర్ వాలిడేషన్ స్టేటస్” పేరుతో కొత్త విండో కనిపిస్తుంది. ఈ విండో ఈ-ఆధార్‌పై సంతకం చేయడానికి ఉపయోగించే సర్టిఫికేట్, ధ్రువీకరణ స్థితి గురించి సమాచారాన్ని ప్రదర్శిస్తుంది.
- “సిగ్నేచర్” ట్యాబ్‌లో సంతకం చేసిన వారి సర్టిఫికేట్ సమాచారం కోసం చూడాలి
- “సిగ్నేచర్ వాలిడేషన్ స్టేటస్” విండోలో “సిగ్నేచర్ ప్రాపర్టీస్” బటన్‌పై క్లిక్ చేయాలి.
- “సిగ్నేచర్ ప్రాపర్టీస్” విండోలో, “షో సైనర్స్ సర్టిఫికెట్” బటన్‌పై క్లిక్ చేయాలి.
- ఇది సంతకం చేసిన వారి సర్టిఫికేట్ వివరాలను ప్రదర్శిస్తుంది. అనంతరం సంతకాన్ని ధృవీకరిస్తోంది.