Precautions For Diabetes - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

Precautions For Diabetes

24_04

 Precautions For Diabetes

ఈ 4 అలవాట్లతో - షుగర్​ ఉన్నవారి లైఫే డేంజర్‌లో పడిపోతుంది! 

Precautions For Diabetes

Precautions For Diabetes : మనిషిని శారీరకంగా, మానసికంగా పూర్తిగా దెబ్బతిసే వ్యాధులలో షుగర్‌ వ్యాధి ఒకటి. ఈ వ్యాధి ఒక్కసారి నిర్ధారణ అయిన తర్వాత వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే.. కొందరు తెలిసీ తెలియక చేసే పొరపాట్ల వల్ల రక్తంలో షుగర్​ భారీగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Precautions For Diabetes : హై-షుగర్ దీర్ఘకాలం పాటు కొనసాగితే.. గుండె, కిడ్నీ జబ్బులు, స్ట్రోక్ వంటి వివిధ హెల్త్‌ ప్రాబ్లమ్స్‌ వచ్చి పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. షుగర్‌ ఉన్నవారు నిత్యజీవితంలో తెలిసీ తెలియక చేసే తప్పుల కారణంగానే బ్లడ్​ షుగర్ పెరిగిపోతుందని చెబుతున్నారు. మరి.. అవేంటో మీకు తెలుసా?

శారీరక శ్రమ చేయకపోవడం :

గంటల తరబడి కూర్చుని పని చేసేవారు, వ్యాయామానికి దూరంగా ఉండే వారిలో టైప్‌ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అయితే.. ఇప్పటికే షుగర్‌ ఉన్న వారు రోజూ శారీరక శ్రమ చేయకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే కనీసం 20 నిమిషాలు వాకింగ్‌ చేయాలని సూచిస్తున్నారు.

ప్రాసెస్డ్ ఫుడ్‌ :

చక్కెర వ్యాధి ఉన్న వారు రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు నియంత్రణలో ఉండటానికి మంచి ఆహారం తినాలి. అయితే, వీరు షుగర్‌, ఫ్యాట్‌, ఉప్పు, క్యాలరీలు ఎక్కువగా ఉండే ప్రాసెస్‌డ్ ఫుడ్‌ తినడం వల్ల గ్లూకోజ్‌ స్థాయిలు పెరుగుతాయి. అలాగే షుగర్‌ ఉండే డ్రింక్స్‌ తాగడం వల్ల కూడా షుగర్‌ స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి, ఫైబర్‌ ఎక్కువగా ఉండే తృణధాన్యాలను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే తాజా పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. కాబట్టి, ఏదైనా ఆహారం తినే ముందు డాక్టర్లను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

రాత్రి పూట ఆలస్యంగా :

రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు దెబ్బతిని, షుగర్ లేని వారికి టైప్ 2 డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం పొంచి ఉందట. ఆల్రెడీ ఉన్నవారికి మరింతగా పెరిగిపోయే ఛాన్స్ ఉందట. అందుకే రాత్రి పడుకోవడానికి 2-3 గంటల ముందు భోజనం చేయడం మంచిదని సూచిస్తున్నారు.

తిన్న వెంటనే నిద్ర :

షుగర్‌ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు తిన్న తర్వాత వెంటనే నిద్రపోవడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2018లో ప్రచురితమైన "డయాబెటిస్ కేర్" జర్నల్‌ నివేదిక ప్రకారం.. తిన్న తర్వాత వెంటనే నిద్రపోయిన వారిలో రాత్రంతా రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారట. ఈ పరిశోధనను 120 మంది మధుమేహం ఉన్న వ్యక్తులపై నిర్వహించారు. ఈ పరిశోధనలో యునైటెడ్ స్టేట్స్‌లోని 'యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్'లోని డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ విభాగం ప్రొఫెసర్ 'డాక్టర్ మైఖేల్ జాన్సన్' పాల్గొన్నారు. తిన్న తర్వాత వెంటనే నిద్రపోయిన వారి రక్తంలో.. మిగతా వారికంటే 20 శాతం షుగర్ అధికంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.