HOW TO OVERCOME THE MATHS FEAR - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

HOW TO OVERCOME THE MATHS FEAR

25_02

HOW TO OVERCOME THE MATHS FEAR

మీ పిల్లలకు లెక్కలంటే భయమా? - ఈ టిప్స్​ పాటిస్తే నిమిషాల్లో ప్రాబ్లమ్స్​ సాల్వ్​ చేస్తారు!

-పిల్లల్లో గణితం పట్ల ఉన్న భయాన్ని తొలిగించాలా? -ఈ టిప్స్​ పాటిస్తే బెస్ట్​ రిజల్ట్​ అంటున్న నిపుణులు

HOW TO OVERCOME THE MATHS FEAR

How to Overcome the Mathematics Fear in Students: ఫిబ్రవరి నుంచి ఏప్రిల్​ వరకు విద్యార్థులు బిజీబిజీగా గడుపుతుంటారు. కారణం ఈ రోజుల్లో ఎగ్జామ్స్​ ఉంటాయి. దీంతో అందరూ ఆ ప్రిపరేషన్​లో ఉంటారు. ఇక పరీక్షలు అంటే చాలా మంది భయపడుతుంటారు. ఎందుకంటే కొన్ని సబ్జెక్ట్స్ టఫ్​గా ఉండటమే. ఒకరికి ఇంగ్లీష్​ అంటే భయం, మరికొద్దిమందికి హిందీ, తెలుగు ఇలా ఉంటాయి. కాగా చాలా మంది పిల్లలకు మ్యాథ్స్‌ అనగానే గుబులు. ఏ చిన్న ప్రాబ్లమ్​ ఇచ్చినా చాలా టఫ్​ అని భావించి దానిని సాల్వ్​ చేయడానికి భయపడుతుంటారు. ఇక ఈ భయం మొత్తంగా చదువులపైన వారి ఆలోచననే మార్చేస్తుంది. అయితే దీన్ని పోగొట్టడానికి ఉపాధ్యాయులూ, పేరెంట్స్​ వినూత్నంగా ఆలోచించాల్సిందేనని, అప్పుడే గణితమంటే కష్టమనే భావన పోయి ఇష్టం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

భయానికి కారణాలివే:

లెక్కలు నేర్చుకునే క్రమంలో ఏదైనా పొరపాటు చేస్తే టీచర్లు దాన్ని పెద్దది చేసి చూపడం, కష్టమైన అంశాలను సులభంగా బోధించలేకపోవడం, సాధనలో తగిన సహకారం లభించకపోవడం లాంటివన్నీ అనుభవాలు ఒకట్రెండుసార్లు ఎదురైతే, భయం, అసహనంతో సబ్జెక్టును దూరం పెట్టడం చేస్తుంటారని చెబుతున్నారు.

తెలివైనవాళ్లే మ్యాథ్స్‌ చేయగలరనే భావనను కల్పిస్తుంటారు కొద్దిమంది. దీనివల్ల అది నా వల్ల కాదులే అనే ఆలోచనతో దాని మీద దృష్టి నిలపారని వివరిస్తున్నారు.

ప్రారంభంలోనే సృజనాత్మకంగా, ప్రాక్టికల్‌గా కాకుండా బట్టీ పట్టించే పద్ధతిలో నేర్పించడం వల్లనా సబ్జెక్ట్​పై అనాసక్తి ఏర్పడవచ్చని వివరస్తున్నారు.

ఈ లక్షణాలు ఉంటే మ్యాథ్స్​ అంటే భయం ఉన్నట్లే!:

లెక్కలు చేయాలంటే భయపడటం, గణితానికి సంబంధించి ఎలాంటి అంశానికైనా దూరంగా ఉండటం లాంటివి కనిపిస్తాయని చెబుతున్నారు.

ఒకటి రెండు సార్లు లెక్కల్లో మార్కులు తక్కువ రావడంతో ఆ సబ్జెక్టులో తాము ఎప్పటికీ వెనకేనన్న భావనలోకి వెళతారని అంటున్నారు.

లెక్కల హోమ్‌వర్క్‌ చేయకపోవడం, స్కూల్‌ అంటేనే ఆసక్తి చూపకపోవడం వంటివి కనిపిస్తాయని అంటున్నారు.

అలాగే టఫ్​ లెక్కలు సాల్వ్​ చేయలేకపోతే వెంటనే కోపాన్ని, అసహనాన్ని చూపడం చేస్తారని చెబుతున్నారు.

పరీక్షల సమయంలో కడుపునొప్పి, తలనొప్పి లాంటివాటికి గురికావడం ఆందోళన కారణంగా వచ్చేవే అని చెబుతున్నారు. ఇలాంటి అనుభవాలు ఉంటే సబ్జెక్టుపైన అయిష్టతను పెంచుతాయని, ఆత్మస్థైర్యమూ దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.

పరిష్కారం ఎలా: భయం వెనక ఉండే కారణాల్ని పలు కోణాల్లో విశ్లేషించి గుర్తిస్తే సమస్యను అధిగమించడం తేలికవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం,

ప్రాక్టీకల్​గా నేర్పిస్తే మేలని చెబుతున్నారు. అంటే లెక్కల్ని వస్తువుల సాయంతో నేర్పిస్తే, పిల్లలు సులభంగా అర్థం చేసుకుంటారని సూచిస్తున్నారు. అడిషన్స్​, తీసివేతలూ, మల్టిఫ్లికేషన్​, భాగహారాలనూ ఈ పద్ధతిలో నేర్పించమని సలహా ఇస్తున్నారు.

"సాధనమున పనులు సమకూరు ధరలోన" అన్నట్టుగా లెక్కల్లో పర్ఫెక్ట్​ కావాలంటే ప్రాక్టీసు చాలా ముఖ్యమంటున్నారు. ఎంత అలవాటైతే అంత ఆత్మవిశ్వాసంతో ఉంటారని, కాబట్టి రోజూ కొంత సమయం కచ్చితంగా గణితానికి కేటాయించమని, వీలైతే రెండు పూటలా సాధన చేయించమని సూచిస్తున్నారు.

కూడికలూ, తీసివేతలూ, గుణకారాలూ ఉండే గేమ్స్, పజిల్స్‌ లాంటివాటితో గణిత నైపుణ్యాలను అలవాటు చేయొచ్చని చెబుతున్నారు.

గణితాన్ని సృజనాత్మక సబ్జెక్టుగా చూడాలి. జవాబు గురించికంటే ప్రాసెస్‌ గురించి ఆలోచించేలా చేయమంటున్నారు.

జంటగా, చిన్న బృందంతో కలిసి నేర్చుకునేలా చేస్తే మేలని చెబుతున్నారు. ఒకే సమస్యను ఇతరులు భిన్నంగా ఎలా చేస్తున్నారో తెలుస్తుంది. దీంతో భయంతోకాకుండా, సరదాగా నేర్చుకుంటారని చెబుతున్నారు.

పొడవు, బరువు లాంటి అంశాలతో ఇంట్లోనూ ప్రాక్టికల్స్‌ చేయించండి. ఒక వంటకానికి కావాల్సిన పదార్థాల్ని కొలవమని చెప్పండి. డబ్బునీ, గది వైశాల్యాన్నీ, చుట్టుకొలతనూ లెక్కించమనండి.

భయాన్ని అధిగమించేవరకూ కొన్నాళ్లపాటు సబ్జెక్టు స్పెషలిస్టుతో ప్రత్యేక తరగతులు చెప్పించవచ్చని, సానుకూల దృక్పథంతోనే టీచర్లూ, తల్లిదండ్రులూ పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఈ సమస్యను పరిష్కరించాలని సూచిస్తున్నారు.