If the switch is turned on, it should rain snow - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

If the switch is turned on, it should rain snow

25_02

If the switch is turned on, it should rain snow

Portable AC: అయ్యారే.! చిన్నది అనుకునేరు.. స్విచ్ ఆన్ చేస్తే మంచు వర్షం కురవాల్సిందే.
If the switch is turned on, it should rain snow



ఏసీలు, ఎయిర్ కూలర్‌లు అటుంచితే.. పోర్టబుల్ ఏసీలు ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులోకి ఉన్నాయి. వీటిని మీరు ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఎప్పుడైనా వాడొచ్చు. మరి ఆ పోర్టబుల్ ఏసీ ఫీచర్లు ఏంటి.? ధర ఏంటి.? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా మరి.
ఫిబ్రవరి ఇంకా పూర్తి కాలేదు. అప్పుడే ఎండ ఠారెత్తిపోతోంది. ఉదయం పూట ఉష్ణోగ్రతలు ఒకట్రెండు డిగ్రీలు పెరిగాయి. ఉక్కపోత, ఎండ వేడికి జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో అందరూ కూడా ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. ఆఫీస్‌లోనో లేక ఏదైనా మాల్‌కి వెళ్లినప్పుడు అయితే ఓకే.. అద్దె ఇంటిలో ఉంటున్నవాళ్ల పరిస్థితి ఏంటి..? గోడ ఏసీలు లాంటివి వాళ్లు ఫిక్స్ చేసుకున్నా.. మళ్లీ ఇల్లు మారేటప్పుడు తీయాల్సి వస్తుంది. మరి అలాంటివారి కోసం పోర్టబుల్ ఏసీలను మీ ముందుకు తీసుకొచ్చేశాం. ఇది ప్రముఖ ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. మరి దాని ధర ఏంటో.? ఫీచర్లు ఏంటో చూసేద్దాం..

అమెజాన్ ఈ-కామర్స్ సైట్‌లో అందుబాటులో ఉన్న ఈ పోర్టబుల్ ఏసీ.. అసలు ధర రూ. 2999 కాగా, సుమారు 76 శాతం తగ్గింపు ధర అంటే రూ. 705కి దొరుకుతోంది. ఈ పోర్టబుల్ ఏసీ ఫ్యాన్‌కు 3 స్పీడ్ ఆప్షన్స్ ఉండగా.. ఎంతసేపు కావాలంటే.. అంతసేపటికి టైమర్ సెట్ చేసుకోవచ్చు. ఇందులో ఏడు లైట్ మోడ్స్ ఉండగా.. దీనిని ఫ్యాన్ కింద, హ్యుమిడిఫయర్ కింద.. కూలర్ కింద వాడుకోవచ్చు. ఈ మినీ ఏసీలో ఉండే 5 స్ప్రే ఆప్షన్స్‌ను మీరు ఒక్కోదానికి లెక్క 4 గంటల నుంచి 12 గంటల వరకు వాడుకోవచ్చు. అటు దీనిలో 300 ఎంఎల్ వాటర్ ట్యాంక్ ఉంది. ఒక్కసారి వాటర్ నింపితే.. 4 గంటల వరకు దీనిని ఉపయోగించుకోవచ్చు.