Inter hall tickets on WhatsApp! - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

Inter hall tickets on WhatsApp!

25_02

Download Inter hall tickets on WhatsApp!

Inter Hall Tickets 2025: ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వాట్సప్‌లోనూ ఇంటర్‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌! ఎలాచేయాలంటే..

Download Inter hall tickets on WhatsApp!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు హాల్‌టికెట్లను కూడా విడుదల చేసింది. అయితే బోర్డు వెబ్‌సైట్‌తోపాటు ‘మనమిత్ర’ వాట్సప్‌ ద్వారా కూడా ఇంటర్‌ హాల్‌ టికెట్లు పొందొచ్చని ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా ఓ ప్రకటనలో తెలిపారు. పలు ప్రైవేట్‌ విద్యా సంస్థల యాజమాన్యాలు ఫీజులు చెల్లించలేదని విద్యార్ధులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లు బోర్డు దృష్టికి రావడంతో.. ఇలా చేయకుండా ఉండేందుకు నేరుగా విద్యార్ధులకు హాల్‌ టికెట్లను అందుబాటులో ఉంచారు. రాష్ట్ర విద్యార్ధులు ఇంటర్మీడియట్‌ వెబ్‌సైట్‌ నుంచి లేదా వాట్సప్‌ నంబరు 95523 00009 ద్వారా గానీ హాల్‌టికెట్లను నేరుగా పొందే వెసులుబాటు కల్పించారు.

వాట్సప్‌లో హాల్‌టికెట్లు ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే..

ముందుగా ఫోన్‌లో 95523 00009 నంబర్‌ను సేవ్‌ చేసుకోవాలి. అనంతరం Hi అని వాట్సప్‌ ద్వారా మెజేస్‌ సెండ్ చేయాలి.

సేవను ఎంచుకోండి అనే లింక్‌పై క్లిక్‌ చేశాక.. విద్యా సేవలు సెలక్ట్‌ చేసి క్లిక్‌ చేయాలి.

అక్కడ ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది.

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులైతే టెన్త్‌ హాల్‌టికెట్‌ లేదా ఆధార్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

అదే సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులైతే ఫస్ట్‌ ఇయర్‌ హాల్‌టికెట్‌ నంబర్‌ లేదా ఆధార్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.

వెంటనే మీ హాల్‌టికెట్‌ వాట్సప్‌ నంబర్‌లో ప్రత్యక్షం అవుతుంది. దానిని డౌన్‌లోడ్‌ చేసుకొని దాచుకోవచ్చు.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు దాదాపు 1535 సెంటర్లలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు, అలాగే మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాదికి ఇంటర్‌ పరీక్షలకు మొత్తం 10,58,893 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. మొదటి సంవత్సరం జనరల్‌ విద్యార్థులు 5,00,963 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 44,581 మంది ఉన్నారు. మొత్తం విద్యార్ధుల్లో జనరల్‌ విద్యార్థులు 4,71,021 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 42,328 మంది ఉన్నారు. ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు పూర్తయిన తర్వాత ఏప్రిల్‌ 1 నుంచి 23వ తేదీ వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ నిర్ణయించింది. ఈ సమయంలో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌కు సంబంధించిన పాఠాలతో పాటు పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు బోధిస్తారు. అనంతరం వీరికి ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 1 వరకు వేసవి సెలవులు ఇస్తారు.