1183 Senior Resident Jobs in AP
AP DME: ఏపీలో 1183 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్.. ఏపీ డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ హాస్పిటల్స్, వైద్య కళాశాలల్లోని వివిధ విభాగాల్లో మొత్తం 1183 సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి నియామక ప్రకటన వెలువడింది. మెడికల్ పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు:
1. సీనియర్ రెసిడెంట్: 1183 ఖాళీలు
అర్హత: మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్/ ఎంసీహెచ్/ డీఎం/ ఎండీఎస్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 44 ఏళ్లు మించకూడదు.
జీత భత్యాలు: నెలకు రూ.97,750 ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: పోస్టు గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులు రూ.2000, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22.03.2025.
ముఖ్యాంశాలు:
* ఏపీ డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ హాస్పిటల్స్, వైద్య కళాశాలల్లో సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి నియామక ప్రకటన వెలువడింది.
* మెడికల్ పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE