AP EAPCET 2025 Notification
ఏపీ ఈఏపీసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల.. ఈ వారంలోనే ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్-ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న ఏపీ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 (ఈఏపీసెట్) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి (APSCHE) ప్రకటనల విడుదల చేసింది. ఈ ఏడాది కూడా ఈఏపీసెట్ పరీక్షను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ (జేఎన్‌టీయూకే) నిర్వహించనుంది.
ఈఏపీసెట్ 2025లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఏపీలోని యూనివర్సిటీలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, అఫిలియేటెడ్ ప్రొఫెషనల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 15వ తేదీ నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 24, 2025వ తేదీ వరకు కొనసాగుతాయి.
ఇక ఏపీ ఈఏపీసెట్ 2025 పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో మే 19 నుంచి 27వ తేదీ వరకు జరగనున్నాయి. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు మే 19, 20 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు మే 21 నుంచి 27వ తేదీ వరకు జరుగుతాయి. దరఖాస్తులకు సంబంధించిన విద్యాప్రమాణాలు, అర్హతలు, ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీలు, పరీక్షల సిలబస్ వంటి ఇతర వివరాలు కింద వివరణాత్మక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.
Important Links:
FOR EAPCET NOTIFICATION CLICKHERE.