Every day Rs. 50 lakhs profit with investment.
Post Office Scheme: ప్రతీ రోజూ రూ. 50 పెట్టుబడితో లక్షల్లో లాభం.. అద్దిరిపోయే స్కీం వివరాలివిగో..
పెరుగుతున్న జీవన వ్యయం మరియు ఆర్థిక అనిశ్చితత్వం నేపథ్యంలో, భద్రమైన పెట్టుబడి ఎంపికలు ప్రజలకు అత్యవసరం అయ్యాయి. పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ (RD) పథకం అటువంటి భద్రమైన మరియు లాభదాయకమైన పెట్టుబడి ఎంపిక. కేంద్ర ప్రభుత్వం మద్దతుతో, ఈ పథకం 6.7% వడ్డీ రేటును అందిస్తుంది.
అవసరాలు రానూ రానూ పెరిగిపోతున్నాయి. ఆదాయం అవసరాలకు తగ్గట్టు పెరగని స్థితి వచ్చింది. ఇలాంటి స్థితిలో ఇవాళ జనాలు తమ తమ స్థాయికి తగ్గట్టు ఇన్వెస్ట్‌మెంట్స్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. భవిష్యత్ ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని వివిధ మార్గాల్లో పెట్టుబడి పెడుతున్నారు. అయితే పెట్టుబడి ఎప్పుడూ కూడా రిస్క్ లేకుండా చూసుకోవాలి. భద్రతతో కూడిన రిటర్న్స్ రావాలంటే పోస్టాఫీసు పథకాలు బెస్ట్ అంటున్నారు నిపుణులు. పోస్టాఫీసు దేశ ప్రజల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతిస్తుంది. పోస్టాఫీసు పథకాల్లో మంచి వడ్డీ రేటు అందిస్తుంది. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే రికరింగ్ డిపాజిట్ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. ఇందులో రోజుకు ₹50 పెట్టుబడి పెట్టడం ద్వారా లక్షల్లో లాభం అందుకోవచ్చు.
రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కాల వ్యవధి ఐదు సంవత్సరాలు. మరో ఐదేళ్లు కూడా పొడిగించుకోవచ్చు. ప్రతినెల కనీసం 100తో రికరింగ్ డిపాజిట్ ఖాతా ఓపెన్ చేయొచ్చు. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. మీరు పెట్టే పెట్టుబడిపై ఆధారపడి ఆదాయం వస్తుంది. ఈ పథకంలో 6.7% వడ్డీ అందిస్తున్నారు. 18 ఏళ్లు నిండిన వారు అవసరమైన పత్రాలు సమర్పించి పోస్టాఫీసులో రికరింగ్ డిపాజిట్ ఖాతా ఓపెన్ చేయొచ్చు. తల్లిదండ్రులు సంరక్షకుల సమక్షంలో మైనర్ల పేరిట కూడా ఖాతా ఓపెన్ చేయొచ్చు. రికరింగ్ డిపాజిట్ పథకంలో రోజుకు 50 అంటే నెలకు 1500 పెట్టుబడి పెట్టారనుకుందాం. అప్పుడు మీ పెట్టుబడి సంవత్సరానికి 18000 అవుతుంది. ఐదు సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు మీ పెట్టుబడి 90000 అవుతుంది. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు ప్రకారం 17,500 వడ్డీ వస్తుంది. మెచ్యూరిటీ నాటికి పెట్టుబడి వడ్డీ కలుపుకొని 1,07,500 వస్తుంది. మరో 10 ఏళ్లు పొడిగిస్తే అప్పుడు మీ చేతికి 2,56,283 అవుతుంది.