Specialist Officer Jobs in Punjab National Bank (PNB).
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు: డిగ్రీ అర్హతతో నెలకు రూ. 85,000 వరకు జీతం!
Bank Jobs: డిగ్రీ ఉందా… నెలకి రు 85,000 జీతం తో బ్యాంకు ఉద్యోగాలు.. అప్లై చేయండి..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఢిల్లీలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 24, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు:
క్రెడిట్ ఆఫీసర్: 250 పోస్టులు
ఇండస్ట్రీ ఆఫీసర్: 75 పోస్టులు
మేనేజర్ (ఐటీ): 05 పోస్టులు
సీనియర్ మేనేజర్ (ఐటీ): 05 పోస్టులు
మేనేజర్ డేటా సైంటిస్ట్: 03 పోస్టులు
సీనియర్ మేనేజర్ (డేటా సైంటిస్ట్): 02 పోస్టులు
మేనేజర్ సైబర్ సెక్యూరిటీ: 05 పోస్టులు
సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ: 05 పోస్టులు
మొత్తం ఖాళీలు: 350
అర్హతలు:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, బీఈ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
21 నుంచి 38 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం:
క్రెడిట్ ఆఫీసర్, ఇండస్ట్రీ ఆఫీసర్: నెలకు రూ. 48,480 – రూ. 85,920.
మేనేజర్ (ఐటీ), మేనేజర్ డేటా సైంటిస్ట్, మేనేజర్ సైబర్ సెక్యూరిటీ: నెలకు రూ. 64,820 – రూ. 93,960.
సీనియర్ మేనేజర్ (ఐటీ), సీనియర్ మేనేజర్ (డేటా సైంటిస్ట్), సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ: నెలకు రూ. 85,920 – రూ. 1,05,280.
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: రూ. 1000.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు: రూ. 50.
ఎంపిక విధానం:
రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష కేంద్రాలు:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 3, 2025.
దరఖాస్తు చివరి తేదీ: మార్చి 24, 2025.
రాత పరీక్ష తేదీలు: మార్చి/మే 2025.
ముఖ్య గమనికలు:
అభ్యర్థులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
దరఖాస్తు చేసే ముందు, అభ్యర్థులు అర్హత ప్రమాణాలను జాగ్రత్తగా చదవాలి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE