AP TET Final Key 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫిబ్రవరి 2024 తుది కీ విడుదలైంది. ఈ పరీక్షలు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా మార్చి 14వ తేదీనే టెట్ ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. ఉపాధ్యాయ నియామక పరీక్షలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.