Ayushman Card: Who can apply for Ayushman Bharat.. How to apply?
Ayushman Card: ఆయుష్మాన్ భారత్‌కు ఎవరు అప్లై చేసుకోవచ్చు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఆయుష్మాన్ భారత్ పథకం కింద అర్హులైన వారికి ఆసుపత్రులలో రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తోంది కేంద్రం. రోజువారీ కూలీలు, భూమి లేని ప్రజలు, నిరుపేదలు లేదా గిరిజనులు ఈ స్కిమ్‌కు అప్లై చేసుకోవచ్చు.
Ayushman Bharat Eligibility: కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలకు కోట్లాది రూపాయలను వెచ్చిస్తుంది. దీని ద్వారా చాలామందికి ప్రయోజనం చేరుతుంది. కేంద్ర పథకల్లో అన్నిటికంటే ముందుగా తెలుసుకోవాల్సింది ‘ఆయుష్మాన్ భారత్’ గురించి. ఇది హెల్త్ స్కిమ్. దీని కింద అర్హులైన వ్యక్తులకు ఉచిత చికిత్స అందిస్తారు. మీరు కూడా ఈ పథకంలో చేరాలనుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. కాని మీరు అర్హులా కాదా? ఎలా దరఖాస్తు చేయలన్నదానిపై తెలుసుకోండి.
ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు:-
–> మీరు ఆయుష్మాన్ కార్డ్ స్కీమ్‌లో చేరాలనుకుంటే, మీరు ముందుగా మీ సమీపంలోని CSC కేంద్రానికి వెళ్లాలి.
–> సంబంధిత అధికారిని కలుసుకుని సంబంధిత పత్రాలను ఇవ్వాలి.
–> మీ డాక్యుమెంట్స్‌ను అధికారులు ధృవీకరించిన తర్వాత అర్హత ఉందో లేదో చెక్ చేస్తారు.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
–> రోజువారీ కూలీ, కార్మికులు.
–> నిరుపేదలు లేదా గిరిజనులు.
–> భూమి లేని ప్రజలు.
–> గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు.
–> కుటుంబంలో దివ్యాంగ సభ్యుడు ఉన్నవారు.
మీరు ఈ జాబితాలో ఉన్నట్లయితే, మీరు ప్రయోజనం పొందవచ్చు.
ఆయుష్మాన్ భారత్ పథకం కింద అర్హులైన వారి కోసం ముందుగా ఆయుష్మాన్ కార్డులు ఇస్తారు. ఈ కార్డుతో ఆసుపత్రులలో రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స పొందవచ్చు.