IGI Aviation Customer Service Agent Recruitment 2024
ఇంటర్ అర్హతతో విమానాశ్రయాల్లో 1074 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.
నోటిఫికేషన్ ముఖ్యంశాలు:
- ఇంటర్ అర్హతతో విమానాశ్రయాల్లో ఉద్యోగాలు..
- మహిళా పురుష అభ్యర్థులకు అవకాశాలు..
- ఉమ్మడి తెలుగు రాష్ట్రాల & భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి..
- రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి..
- ఎంపికైతే దాదాపుగా రూ.25,000/- నుండి రూ.35,000/- వరకు వేతనం అందుకోవచ్చు..
నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం, ముఖ్య తేదీలు, ఆన్లైన్ దరఖాస్తు విధానం, రాత పరీక్ష అంశాలు, సిలబస్ మొదలగునవి మీకోసం ఇక్కడ..
ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఏవియేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న యువ డైనమిక్ అభ్యర్థుల నుండి కస్టమర్ సర్వీస్ ఏజెంట్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.. ఆసక్తి కలిగిన భారతీయ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తు సమర్పించండి.
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య :: 1074.
పోస్ట్ పేరు : కస్టమర్ సర్వీస్ ఏజెంట్.
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్/ ఆపై అర్హతలు కలిగి ఉండాలి.
ఇతర అర్హత ప్రమాణాలు:
మహిళా పురుష అభ్యర్థులు, ఎటువంటి అనుభవం లేని ఫ్రెషర్స్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు.
ఏవియేషన్ ఎయిర్లైన్స్ సర్టిఫికెట్ లేదా డిప్లొమా సర్టిఫికెట్లు అవసరం లేదు.
ఇంటర్ పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోండి.
వయోపరిమితి :
దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థులు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
రాత పరీక్షలో ఈ దిగువ పేర్కొన్న అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;
ఇంటర్మీడియట్ సిలబస్ స్టాండర్డ్/ గ్రేడ్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి.
జనరల్ అవేర్నెస్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
ఏవియేషన్ నాలెడ్జ్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
ఇంగ్లీష్ నాలెడ్జ్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
ఆప్టిట్యూడ్ రీజనింగ్ నుండి 25 పర్సనల్ 25 మార్కులకు..
ఇలా మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు.
ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.
నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు.
పరీక్షా సమయం (1.5 Hours) గంటన్నర 90 నిమిషాలు.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు:
దేశవ్యాప్తంగా 9 రాష్ట్రా/ కేంద్రపాలిత ప్రాంతాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు విశాఖపట్నం, హైదరాబాద్ పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసుకోవచ్చు..
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: రూ.350/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.03.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 22.05.2024 వరకు.
రాత పరీక్ష నిర్వహించు తేదీ :: త్వరలో తెలియపరుస్తారు.
ఫలితాలు విడుదల తేదీ :: రాత పరీక్ష నిర్వహించిన 15 రోజుల్లో అందుబాటులో వస్తాయి..
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE