DA Hike - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

DA Hike

24_03

 DA Hike: Many benefits with DA increase.. Employees must be aware of those things..!

DA Hike: డీఏ పెంపుతో బోలెడన్ని లాభాలు.. ఉద్యోగులకు ఆ విషయాలపై అవగాహన మస్ట్..!

DA Hike: Many benefits with DA increase.. Employees must be aware of those things..! DA Hike: డీఏ పెంపుతో బోలెడన్ని లాభాలు.. ఉద్యోగులకు ఆ విషయాలపై అవగాహన మస్ట్..!

డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్), డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని 4 శాతం పెంచాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్‌లకు మొత్తం డీఏ వారి మూల వేతనంలో 50 శాతానికి సమానంగా ఉంటుంది. డియర్‌నెస్ రిలీఫ్, డియర్‌నెస్ అలవెన్స్‌కు సంబంధించిన మొత్తం వార్షిక ప్రభావం రూ. 12,868.72 కోట్లుగా ఉంది. డీఏ పెంపు వల్ల 67.95 లక్షలు, రూ.49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఈ నిర్ణయం వల్ల రవాణా, డిప్యూటేషన్, క్యాంటీన్ అలవెన్సులు 25% పెరుగుతాయని నిపుణుల అంచనా. అయితే డీఏ పెంపు పరిధిలోకి వచ్చే వారికి ఓ ఆరు విషయాలపై అవగాహన అవసరమని నిపుణులు వివరిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో నిపుణులు వివరించే సూచనలను ఓ సారి తెలుసుకుందాం. 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ రేట్లు జనవరి 1, 2024 నాటికి వారి మూల వేతనంలో 46 శాతం నుంచి 50 శాతానికి పెరుగుతాయి.

సవరించిన పే స్ట్రక్చర్‌లోని బేసిక్ పే అనేది 7వ సీపీసీకు సంబంధించిన ప్రభుత్వం ఆమోదించిన సిఫార్సులకు అనుగుణంగా పే మ్యాట్రిక్స్‌లో పేర్కొన్న స్థాయిలో డ్రా చేసిన వేతనాన్ని సూచిస్తుంది. ఇది ప్రత్యేక చెల్లింపు వంటి అన్ని ఇతర రకాల చెల్లింపులను మినహాయిస్తుంది.

డియర్‌నెస్ అలవెన్స్ జీతంలో ప్రత్యేక భాగంగా ఉంటుంది. అలాగే ఎఫ్ఆర్ 9(21) ప్రకారం చెల్లింపుగా పరిగణించరు. 

50 పైసలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాలకు డియర్‌నెస్ అలవెన్స్ చెల్లింపు తదుపరి మొత్తం రూపాయికి పూర్తి చేస్తారు. అయితే 50 పైసల కంటే తక్కువ మొత్తాలు విస్మరిస్తారనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. 

డియర్‌నెస్ అలవెన్స్ బకాయిలు మార్చి 2024 జీతం పంపిణీ తేదీ కంటే ముందు చెల్లింరు. ఈ ఆదేశాలు రక్షణ సేవల అంచనాల నుంచి వేతనం పొందే సైనికేతర సిబ్బందికి కూడా వర్తిస్తాయి. ఏదైనా అనుబంధిత ఖర్చులు తప్పనిసరిగా డిఫెన్స్ సర్వీసెస్ ఎస్టిమేట్స్‌కు సంబంధించిన హెడ్‌కు కేటాయిస్తారు. రైల్వే మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ వరుసగా రైల్వే, సాయుధ దళాల ఉద్యోగుల కోసం వేర్వేరు ఆదేశాలను ప్రచురిస్తాయి.

డీఏ, డీఆర్ వినియోగదారుల ధరల సూచికను ఉపయోగించి సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తారు. ప్రారంభ నవీకరణ, జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. సాధారణంగా హోలీ పండుగకు కొంతకాలం ముందు వెల్లడి చేస్తారు. ఇదిలా ఉండగా జూలై 1 నుంచి అమలులోకి వచ్చే రెండవ అప్‌డేట్ సాధారణంగా దుర్గా పూజ వేడుకకు ముందే నిర్ణయిస్తారు. 

డీఏ అనేది ఆల్-ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్‌ను ఉపయోగించి నిర్ణయిస్తారు. ఇది కాలక్రమేణా సాధారణ వస్తువుల ఖర్చులు ఎలా హెచ్చుతగ్గులకు గురవుతాయో సూచిస్తుంది.