Greaves Eltra City: EV auto release in the market with super comfort.. Impressive features with mileage of 160 km.
Greaves Eltra City: సూపర్ కంఫర్ట్‌తో మార్కెట్‌లోకి ఈవీ ఆటో రిలీజ్.. 160 కిలో మీటర్ల మైలేజ్‌తో ఆకట్టుకుంటున్న ఫీచర్లు.
ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాల వాడకం గణనీయంగా ఉందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఈవీ వాహనాలు ఎక్కువగా వ్యక్తిగతంగా వాడుకునేలా రూపొందిస్తున్నారు కానీ రవాణా రంగానికి ఊతమిచ్చేలా ఈవీ వాహనాలు మార్కెట్‌లో రిలీజ్ కావడం లేదు. అయితే ప్రజారవాణాకు ఉపయోగపడే ఆటోల్లో కొన్ని రకాల ఈవీలు అందుబాటులో ఉన్నా మైలేజ్ విషయంలో పెద్దగా ఆకర్షించడం లేదు. ఎందుకంటే చాలా మంది ఆటో డ్రైవర్లు ఇంటి వద్ద చార్జ్ చేసుకుని రోజంతా తిరిగేంత మైలేజ్ వచ్చే ఆటోలు ఉంటే ఈవీ వైపు మళ్లే అవకాశం ఉంది. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ గ్రీవ్స్ ఎల్ట్రా కార్గోతో ద్వారా సరికొత్త ఈవీ ఆటోలను లాంచ్ చేసింది. గ్రీవ్స్ ఎల్ట్రా సిటీ పేరుతో రిలీజ్ చేసిన ఈ ఈవీ ఆటోలు కచ్చితంగా ఆటోడ్రైవర్లకు నచ్చుతాయని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రీవ్స్ కంపెనీ రిలీజ్ చేసిన ఈవీ ఆటోల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని ఆటో డ్రైవర్లకు ఉపయోగపడేలా గ్రీవ్స్ ఈవీ ఆటోలను లాంచ్ చేసింది. గ్రీవ్స్ ఎల్ట్రా సిటీ 9.6 కేడబ్ల్యూ మోటార్, శక్తివంతమైన 10.8 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది. అలాగే పట్టణ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. 14-డిగ్రీల గ్రేడబిలిటీ, 49 ఎన్‌ఎం టార్క్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి అగ్రశ్రేణి లక్షణాలతో ఈ ఈవీ ఆటో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ ఈవీ రద్దీగా ఉండే నగర వీధుల్లో నావిగేట్ చేయడం ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఈ ఈవీ ఆటో ఐఓటీ IoT సామర్థ్యాలతో కూడిన అత్యాధునిక 6.2 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది. అలాగే వినియోగదారులకు నిజ-సమయ సమాచారంతో పాటు నావిగేషన్‌ను అందిస్తుంది.
భద్రత విషయానికి వస్తే ఈ ఈవీ ఆటో మన్నికైన పూర్తి మెటల్ బాడీతో వస్తుంది. అలాగే 3 సంవత్సరాల వారెంటీతో పాటు ఐదు సంవత్సరాల పొడగింపు వారెంటీ ద్వారా వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఈ ఈవీ ఆటో నిర్వహణ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది ఒకే ఛార్జ్‌పై దాదాపు 160 కిలోమీటర్ల ఆకట్టుకునే పరిధితో గ్రీవ్స్ ఎల్ట్రా సిటీ డ్రైవర్లను ఆకర్షిస్తుంది. ఎల్ట్రా సిటీ కచ్చితంగా విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుందని గ్రీవ్స్ ప్రతినిధులు పేర్కొంటున్నారు.