Inspirational News : A girl born in a Mumbai slum.. is now a model for an international brand.. Do you know how it became possible?
Inspirational News : ముంబై స్లమ్‌లో పుట్టిన అమ్మాయి.. ఇప్పుడు ఇంటర్నేషన్ బ్రాండ్‌కి మోడల్.. ఎలా సాధ్యం అయిందో తెలుసా?
Inspirational News : మలీషా ఖార్వా అనే బాలిక వయసు 15 ఏళ్లు. తను ముంబైలోని ఓ స్లమ్ లో పుట్టింది. అక్కడే పెరిగింది. కానీ.. తనకు ఉన్న ఆలోచనలు గొప్పవి. చాలా పెద్ద పెద్ద లక్ష్యాలు ఉండేవి. పెద్ద మోడల్ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నది మలీషా. ఆ కలలను నిజంగానే నిజం చేసుకున్నది. 15 ఏళ్ల వయసులోనే ఆ బాలిక ఇంటర్నేషనల్ బ్రాండ్ కు అంబాసిడర్ అయింది. తనను ఇప్పుడు ప్రొఫెషనల్ చైల్డ్ మోడల్. కానీ.. అది ఎలా సాధ్యం అయిందో తెలుసా? రాబర్ట్ హాఫ్ మన్ అనే వ్యక్తిని మీట్ అవడమే తన లైఫ్ ను టర్న్ చేసింది.
ఇంతకీ ఈ రాబర్డ్ హాఫ్ మాన్ ఎవరు అంటారా? మీకు స్టెప్ అప్ 2, ది స్ట్రీట్స్ 2008 మూవీ గుర్తుందా? ఆ సినిమాలో నటించి ఫేమస్ అయ్యాడు రాబర్ట్. ఆయన 2020లో ఓ మ్యూజిక్ వీడియో కోసం ముంబైకి వెళ్లారు. అప్పుడే కోవిడ్ కూడా వచ్చింది. దీంతో ఐదు నెలలు ముంబైలోని ఉండాల్సి వచ్చింది. అప్పుడే మలీషాను చూశాడు రాబర్ట్.మలీషాను చూడగానే ఇలాంటి అమ్మాయి అసలు స్లమ్ లో ఎందుకు ఉంటోంది అని అనుకున్నాడు రాబర్ట్. ఎందుకంటే తనది మామూలు ఫేస్ కాదు.
మిలియన్ డాలర్ ఫేస్. తనలో ఫేస్ లో ఉన్న తేజస్సును గుర్తించారు రాబర్ట్. వెంటనే తన దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడారు రాబర్ట్. తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అడిగారు. దీంతో తనకు డ్యాన్సర్, మోడల్ కావాలని ఉందని చెప్పింది. దీంతో తను వెతుకున్న అమ్మాయి తనే అని అనుకున్నారు రాబర్ట్.
అలా.. ఇంటర్నేషనల్ బ్రాండ్ కు మలీషా బ్రాండ్ అంబాసిడర్ అయింది. ఇప్పుడు ఏ ఫ్యాషన్ మేగజైన్ లో చూసినా మలీషా గురించే చర్చ. సోషల్ మీడియాలోనూ తనకు ఫాలోవర్స్ పెరిగారు. ది ప్రిన్సెస్ ఆఫ్ స్లమ్స్ అంటూ మలీషాను ఫ్యాషన్ మేగజైన్స్ పొగడ్తల్లో ముంచెత్తుతున్నాయి. తన డ్రీమ్ ఇంత త్వరగా తీరుతుందని కలలో కూడా అనుకోలేదని భావోద్వేగంతో చెప్పుకొచ్చింది మలీషా.