Medicines Taking - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

Medicines Taking

24_03

Medicines Taking: Are you taking all the pills at once.. Very dangerous! 

Medicines Taking: మాత్రలన్నీ ఒకేసారి కలిపి వేసుకుంటున్నారా.. చాలా డేంజర్!

Medicines Taking: Are you taking all the pills at once.. Very dangerous!  Medicines Taking: మాత్రలన్నీ ఒకేసారి కలిపి వేసుకుంటున్నారా.. చాలా డేంజర్!

మనలో చాలా మంది తెలిసీ తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. అయితే వాటితో వచ్చే పెద్ద సమస్యల్ని మాత్రం గుర్తించారు. అందులో ఒకటి ట్యాబ్లెట్స్ వేసుకోవడం. మాత్రలు ఎలా వేసుకోవాలో ఇప్పటికీ చాలా మందికి తెలియదు. చాలా మంది తిన్న వెంటనే ట్యాబ్లెట్స్ అనేవి వేసేసుకుంటారు. అలాగే ఇంకొంత మంది అన్నీ కలిపి ఒకేసారి వేసుకుంటారు. ఇలా చేయడం చాలా తప్పు. సరైన అవగాహన కూడా ఉండదు. కానీ వీటితో ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో చెప్పడం కష్టమే. ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాత్రలను సరైన విధంగా ఎలా వేసుకోవాలో.. తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు తీసుకునే ట్యాబ్లెట్స్‌ను సరైన విధంగా వేసుకుంటే.. అది ఔషధంగా పని చేస్తుంది.

ప్రిస్క్రిప్షన్ ప్రకారమే మందులు వేసుకోవాలి..

చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. మెడికల్ షాపుకు వెళ్లి మందులు తెచ్చుకుని వేసేసుకుంటారు. ఇలా వేసుకోవడం వల్ల పలు దీర్ఘకాలిక జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఎప్పుడైనా సరే వైద్యుల వద్దకు వెళ్లి సరైన ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ ఉంటే.. డాక్టర్ల దగ్గరకు వెళ్లి సరైన టెస్టులు తీసుకున్న తర్వాతే మందులు అనేవి వేసుకోవాలి. మెడిసిన్స్ ఎక్కువగా తీసుకోవడం.. కాలేయం, కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే ఎక్కువగా కూడా ట్యాబ్లెట్స్ అనేవి వేసుకోకూడదు. వీలైనంత వరకూ ఇంట్లో ఉండే హోమ్ రెమిడీస్ పాటించాలి. చిన్న చిన్న జబ్బులకు కూడా వైద్యులను సంప్రదించి.. మందులు వేసుకోకూడదు.

తిన్న వెంటనే ట్యాబెట్లు అస్సలు వేసుకోకూడదు..

ఇలా వేసుకోవడం వల్ల కాలక్రమేణా భయంకరమైన పరిణామాలను కలిగిస్తుంది. విచక్షణా రహితంగా మందులు వేసుకుంటే.. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. వైద్యులు సూచించిన మందులు మాత్రమే తీసుకోవాలి. అదే విధంగా ట్యాబ్లెట్లు వేసుకునే విధానం కూడా చాలా ముఖ్యం. భోజనం తర్వాత వెంటనే మందులు వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవి పోషకాల శోషణను నిరోధిస్తాయి. ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మాత్రలు అనేవి సరైన సమయానికి మాత్రమే తీసుకోవాలి. భోజనం చేసిన అరగంట లేదంటే 15 నిమిషాల తర్వాత వేసుకోవాలి తప్పించి.. వెంటనే మాత్రం అస్సలు వేసుకోకూడదు. అలాగే చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. వైద్యులు రాసిచ్చిన మందులన్నింటినీ కలిపి ఒకదాని తర్వాత మరొకటి వేసుకుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. ఒక ట్యాబ్లెట్ వేసుకున్న పది నిమిషాల తర్వాత మరొకటి వేసుకోవాలి. అప్పుడే ఆ మాత్ర.. చక్కగా పని చేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు www.apteachers9.com బాధ్యత వహించదు.)