SBI: SBI Super Program.. Opportunity to earn by doing community service..
SBI: ఎస్‌బీఐ సూపర్ పోగ్రామ్.. సమాజ సేవ చేస్తూ సంపాదించే అవకాశం..
SBI: సామాజిక సేవపై ఆసక్తి ఉన్న గ్రాడ్యుయేట్స్, యంగ్ ప్రొఫెషనల్స్‌కు గుడ్‌న్యూస్. స్టేట్ బ్యాంక్ గ్రూప్‌లోని SBI ఫౌండేషన్ ‘ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రామ్’ 12వ బ్యాచ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
సామాజిక సేవపై ఆసక్తి ఉన్న గ్రాడ్యుయేట్స్, యంగ్ ప్రొఫెషనల్స్‌కు గుడ్‌న్యూస్. స్టేట్ బ్యాంక్ గ్రూప్‌లోని SBI ఫౌండేషన్ ‘ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రామ్’ 12వ బ్యాచ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశంలో సామాజికంగా మార్పులు తీసుకురావడం లక్ష్యంగా ఎస్‌బీఐ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. తాజాగా 2024కు సంబంధించిన ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ను సంస్థ ప్రారంభించింది. దీని అర్హత, పని చేయాల్సిన రంగాలు, స్టైఫండ్ వంటి వివరాలు పరిశీలిద్దాం.
ఎవరు అర్హులు?
ఈ ప్రోగ్రామ్ 13 నెలల పాటు కొనసాగుతుంది. 21 నుంచి 32 ఏళ్ల వయసున్న గ్రాడ్యుయేట్లు, యంగ్ ప్రొఫెషనల్స్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియా, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాతో పాటు భూటాన్, నేపాల్‌కు చెందినవారు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఎంపికైన వారు గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను ప్రోత్సహించడానికి అంకితభావంతో పనిచేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ సంఘాలు, 13 టాప్ NGOలతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.youthforindia.org/register లింక్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.
పనిచేయాల్సి రంగాలివే:
ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్ 12వ బ్యాచ్.. పన్నెండు నేపథ్య రంగాలపై దృష్టి సారిస్తుంది. అందులో టెక్నాలజీ, మహిళా సాధికారత, స్వయం పరిపాలన, సామాజిక వ్యవస్థాపకత, పర్యావరణ పరిరక్షణ, సంప్రదాయ క్రాఫ్ట్, ఆరోగ్యం, గ్రామీణ జీవనోపాధి, ఆహార భద్రత, విద్య, నీరు- ప్రత్యామ్నాయ శక్తి వంటి రంగాలు ఉంటాయి. ఎంపికయ్యే అభ్యర్థులు తమ అభిరుచి, నైపుణ్యం ఆధారంగా ఏదో ఒక రంగంలో పనిచేయాల్సి ఉంటుంది.
స్టైఫండ్ వివరాలు
ఫెలోషిప్‌కు ఎంపికైన వారికి ప్రోగ్రామ్ డ్యూరేషన్‌లో నెలకు రూ.15,000 స్టైఫండ్, రూ.1,000 ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్, ప్రాజెక్ట్ సంబంధిత ఖర్చుల కోసం మరో రూ.1,000 అందిస్తారు.
గ్రామీణ సమాజంలో మార్పే లక్ష్యంగా..
SBI ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్, CEO సంజయ్ ప్రకాష్ మాట్లాడుతూ.. ‘‘గ్రామీణ భారతానికి మంచి భవిష్యత్తును సృష్టించాలనుకునే వారికి ఈ ప్రోగ్రామ్ అనువైనది. SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రామ్ అనేది పట్టణ యువత ఆకాంక్షలు, గ్రామీణ వాస్తవికత మధ్య అంతరాన్ని భర్తీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ సమాజంలో పరివర్తనాత్మక మార్పును సృష్టించేందుకు కృషి చేస్తుంది.’’ అని సంజయ్ ప్రకాష్ అన్నారు.
ఫ్రోగ్రామ్ నెట్‌వర్క్ ఇలా..
ఎస్‌బీఐ ఫెలోషిప్ ప్రోగ్రామ్ 20 రాష్ట్రాల్లో విస్తరించింది. 250 గ్రామాల్లో 1,50,000 మంది వ్యక్తుల జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేసింది. అందుకు 580 మంది గ్రాడ్యుయేట్ల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.
ఈ ప్రోగ్రామ్‌లో చేరిన గ్రాడ్యుయేట్స్‌లో 100 మందికి పైగా పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీలను ప్రస్తుతం అభ్యసిస్తున్నారు. ప్రధానంగా గ్రామీణ అభివృద్ధి, పబ్లిక్ పాలసీ/ప్రభుత్వం, విద్యా వంటి సామాజిక రంగాలపై సుమారు 70 శాతం మంది విద్యార్థులు పీజీ చేస్తున్నారు.
ఉన్నత హోదాలో పనిచేస్తున్న పూర్వ విద్యార్థులు:
ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన పూర్వ విద్యార్థుల్లో కొందరు ఉన్నత స్థాయిల్లో పనిచేస్తున్నారు. హిమాన్షు పాండే (YFI 2016–17 బ్యాచ్) NITI ఆయోగ్ & కన్సల్ట్స్‌లో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్‌లో పనిచేస్తున్నాడు. నమన్ బన్సాల్ (YFI 2015–16 బ్యాచ్) హార్వర్డ్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (M.Ed.) చదువుతున్నాడు. మరో సీనియర్ పూర్వ విద్యార్థి సిమ్రాన్ గ్రోవర్ (YFI 2011–12 బ్యాచ్) క్లైమేట్ గవర్నెన్స్ అండ్ ఎనర్జీపై దృష్టి సారించే సెంటర్ ఫర్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ & పీపుల్ (CEEP)ను స్థాపించాడు.