Sugar Vs Jaggery: What is the difference between sugar and jaggery? Which is better? - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

Sugar Vs Jaggery: What is the difference between sugar and jaggery? Which is better?

24_03

 Sugar Vs Jaggery: What is the difference between sugar and jaggery? Which is better?

Sugar Vs Jaggery: పంచదార, బెల్లం మధ్య తేడా ఏంటి? ఏది మంచిది?

Sugar Vs Jaggery: What is the difference between sugar and jaggery? Which is better? Sugar Vs Jaggery: పంచదార, బెల్లం మధ్య తేడా ఏంటి? ఏది మంచిది?

చెరకు లేదా బీట్‌రూట్ రసం నుంచి చక్కెర తయారవుతుంది. స్వీట్‌నెస్‌ కోసం ప్రజలు పంచదార లేదా బెల్లం వాడుతుంటారు. అయితే పంచదార ఎక్కువగా ప్రాసెస్‌ చేసి ఉంటుంది కాబట్టి దాని కంటే బెల్లం తినడం మంచిది. ఎందుకంటే బెల్లం ఇనుము, ఫైబర్, ఖనిజాలను కలిగి ఉంటుంది.

Sugar Vs Jaggery: రెండు తియ్యగానే ఉంటాయి.. అయితే ఒకటి వైట్‌గా ఉంటుంది.. ఇంకోటి ఎల్లో కలర్‌లో ఉంటుంది. రెండిటిని వంటింట్లో వాడుతుంటాం. కొన్నిసార్లు పంచదార వేస్తాం.. మరికొన్నిసార్లు బెల్లం వేస్తాం. బయట జిలేబీ షాపుల్లో పంచదార, బెల్లంతో చేసిన రెండు ఐటెమ్స్‌ మనకు కనిపిస్తాయి. మీరు గమనిస్తే వాటి కలర్‌ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. కొంతమందికి పంచదారతో చేసిన స్వీట్‌ ఇష్టం.. మరికొంతమందికి బెల్లంతో చేసిన స్వీటును ఇష్టపడతారు. అయితే ఏది మంచిది? పంచదారతో చేసినవి కంటే బెల్లంతో చేసినవి తింటే మంచిదా? 

చక్కెర:

ఇది సాధారణంగా చెరకు లేదా బీట్‌రూట్ రసం నుంచి తయారవుతుంది. దీన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు. అందుకే ఇది పూర్తిగా తెల్లగా కనిపిస్తుంది. దాని ప్రాసెసింగ్‌లో రసాన్ని వేడి చేస్తారు.. దీని కారణంగానే తెలుపు రంగు చక్కెరకు వస్తుంది. అయితే ఇంత ప్రాసెస్‌ చేస్తారు కాబట్టే పంచదారను తక్కువగా తినాలి. పంచదారను అధికంగా తీసుకోవడం అంటే ఆరోగ్యానికి ప్రమాదకరమైన వ్యాధులను ఆహ్వానించడమేనని అనేక పరిశోధనలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఎక్కువగా పంచదారను వినియోగం వల్ల అన్నవాహిక క్యాన్సర్, ప్లూరల్ క్యాన్సర్, చిన్న ప్రేగు క్యాన్సర్ ప్రమాదాలను పెంచుతుందని పరిశోధనలు కనుగొన్నాయి. అధికంగా ప్రాసెస్ చేసిన పంచదారను ఆహారం అధికంగా తీసుకోవడం వల్ల డిప్రెషన్ సమస్య కూడా పెరుగుతుంది. 8,000 మంది వ్యక్తులపై జరిపిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. రోజుకు 40 గ్రాముల కంటే తక్కువ చక్కెరను తినే పురుషుల కంటే 67 గ్రాములు లేదా అంతకంటే ఎక్కువ చక్కెరను వినియోగించే పురుషులు 23శాతం ఎక్కువగా డిప్రెషన్‌తో బాధపడుతున్నారు.

బెల్లం:

నిజానికి బెల్లం, పంచదార కేలరీల విషయంలో సమానంగా ఉంటాయి. అయితే ఈ రెండిటిని పోల్చినప్పుబు వైద్యులు బెల్లాన్నే వినియోగించాలని చెబుతుంటారు. ఎందుకంటే బెల్లం ఇనుము, ఫైబర్, ఖనిజాలను కలిగి ఉంటుంది. ఇవి మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి, బెల్లాన్ని ప్రాసెస్ చేయరు. అందుకే పంచదారను బెల్లంతో భర్తీ చేయడం మంచిది. ఇది మన శరీరానికి తీపి రుచితో పాటు కొన్ని పోషకాలను అందిస్తుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. www.apteachers9.com దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.