Thyroid Test: Find out easily if you have thyroid..
Thyroid Test: మీకు థైరాయిడ్ ఉందో లేదో ఈజీగా ఇలా తెలుసుకోండి..
ఆధునిక లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది ఇప్పుడు అనేక సమస్యల బారిన పడుతున్నారు. వాటిల్లో థైరాయిడ్ కూడా ఒకటి. ఈ సమస్య కారణంగా చాలా మందిలో దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. చిన్నవారిలో సైతం థైరాయిడ్ కనిపిస్తుంది. థైరాయిడ్ సమస్యతో బాధ పడేవారు ఖచ్చితంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అదే విధంగా తీసుకునే ఆహారం విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. థైరాయిడ్‌ను ప్రారంభంలోనే గుర్తించి, సరైన చికిత్స తీసుకుంటే.. సులభంగా ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. అయితే చాలా మందికి థైరాయిడ్ లక్షణాలు తెలీవు. థైరాయిడ్ ఉన్నవారిలో అనేక లక్షణాలు కనిపిస్తాయి. ముందుగానే వీటిని గుర్తిస్తే.. ఆరోగ్యంగా ఉండొచ్చు. థైరాయిడ్ ఉన్నప్పుడు కనిపించే కొన్ని ముఖ్యమైన లక్షణాల గురించి తెలుసుకుందాం.
ఒక్కటేసారి బరువు తగ్గడం లేదా పెరగడం:
థైరాయిడ్ ఉన్నవారిలో గమనించే ముఖ్యమైన లక్షణాల్లో బరువు కూడా ఒకటి. ఒక్కటేసారి బరువు పెరగడం లేదా తగ్గినట్లయితే వారు థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నట్లు గుర్తించాలి. కాబట్టి వెంటనే వైద్యుల్ని కలవడం మంచిది.
అలసటగా ఉంటారు:
థైరాయిడ్ ఉన్నవారిలో మరో ప్రధానమైన లక్షణం ఏంటంటే.. అలసట. వీరిటో ఉన్నట్టుండి అలసట అనేది పెరిగిపోతుంది. చిన్న చిన్న పనులకు సైతం అలసిపోతున్నట్లు అనిపిస్తుంది. హైర్ థైరాయిడిజం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మీరు తరుచుగా అలసటకు గురవుతూ ఉంటే.. డాక్టర్ని సంప్రదించడం మేలు.
శరీరంలో వేడి:
థైరాయిడ్ ఉన్నవారిలో ఉష్ణోగ్రత కూడా ప్రభావితం చేస్తుంది. హైపోథైరాయిడిజం ఉన్నవారిలో కూడా శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. అదే విధంగా ఎక్కువగా కూడా ఉండొచ్చు. కాబట్టి చెక్ చేసుకోండి.
చర్మం – జుట్టు సమస్యలు:
థైరాయిడ్ ఉంటే చర్మం – జుట్టుపై కూడా ఖచ్చితంగా ప్రభావం పడుతుంది.ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉంటే.. చర్మం పొడిగా, ముడతలుగా ఉంటుంది. అదే విధంగా జుట్టు కూడా విపరీతంగా రాలిపోతుంది. కాబట్టి ఇలా ఉంటే వెంటనే థైరాయిడ్ టెస్ట్ చేసుకోవడం బెటర్.
మానసిక స్థితిలో మార్పులు:
థైరాయిడ్ సమస్య.. మానసిక స్థితిపై కూడా ప్రభావం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీరిలో నిరాశ, ఒత్తిడి, ఆందోళన అనేవి ఎక్కువగా కనిపిస్తాయట. అంతే కాకుండా ప్రతీ విషయానికి చిరాకు, ఆందోళన పడిపోతారని పలు పరిశోధనల్లో తేలింది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు APTEACHERS9.COM బాధ్యత వహించదు.)