CAREER OPTIONS AFTER BTECH - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

CAREER OPTIONS AFTER BTECH

25_02

CAREER OPTIONS AFTER BTECH

బీటెక్ తర్వాత సాఫ్ట్‌వేర్‌లో స్థిరపడాలంటే ఈ కోర్సులు చేయాల్సిందే!

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడాలంటే ఏం చేయాలి? - విదేశాల్లో ఎంఎస్‌ చేస్తే మేలా? ఉన్నత ఉద్యోగానికి మన దేశంలో అవకాశాలు ఎలా ఉంటాయి?

CAREER OPTIONS AFTER BTECH

What To Do After BTech? నేను బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ) చదువుతున్నాను. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడాలంటే ఇప్పటి నుంచే ఎలా సన్నద్ధం కావాలి? విదేశాల్లో ఎంఎస్‌ చేస్తే మేలా? ఉన్నత ఉద్యోగానికి మన దేశంలో అవకాశాలు ఎలా ఉంటాయి? - ఆదిత్య, హైదరాబాద్‌

కెరియర్‌ కౌన్సెలర్‌ ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్ సమాధానం : ప్రస్తుతం మీరు బీటెక్‌ ఎన్నో సంవత్సరం చదువుతున్నారో చెప్పలేదు. బీటెక్‌ సైబర్‌ సెక్యూరిటీ, కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్న సూడెంట్స్​ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా స్థిరపడాలి అంటే టెక్నికల్‌ నైపుణ్యాలు, ప్రాక్టికల్‌, నిర్దిష్ట డొమైన్‌ నాలెడ్జ్, అనుభవం అధికంగా ఉండాలి. టెక్నికల్‌ నైపుణ్యాల విషయానికి వస్తే జావా, జావా స్క్రిప్ట్, సీ ప్లస్‌ ప్లస్‌, పైతాన్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి.

ఎస్‌క్యూఎల్, మాంగో డీబీ లాంటి డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌ టూల్స్‌పై పట్టు అవసరం. సీఎస్‌ఎస్, హెచ్‌టీఎంఎల్, రియాక్ట్‌ లాంటి వెబ్‌ డెవలప్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌లపై అవగాహన ఉండాలి. అజుర్, ఏడబ్ల్యూఎస్, జీసీపీ లాంటి క్లౌడ్‌ టెక్నాలజీ సంబంధ కోర్సులు నేర్చుకుంటే అదనపు ప్రయోజనం. సైబర్‌ సెక్యూరిటీ కోర్సులు, ఎన్‌క్రిప్షన్, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ, ఎథికల్‌ హాకింగ్‌ల మీద నైపుణ్యం పొందాలి. గిట్, గిట్‌హబ్‌ వాడటం నేర్చుకోవాలి. ఇంటర్న్‌షిప్, ప్రాజెక్టుల ద్వారా అనుభవం పెంచుకోవడం మంచిది.

ఇతర దేశాల్లో ఎంఎస్‌ చేయడం వల్ల అక్కడే జాబ్​ పొంది ఇతర దేశాల్లో స్థిరపడే అవకాశాలు ఉంటాయి. కానీ కొన్ని వేల మంది ఇంజినీర్లు ఉన్నత విద్య కోసం ఇతర దేశాలకు వెళ్లడం వల్ల అక్కడ కూడా జాబ్​ పొందడం అంత సులువుగా లేదు. చాలా మంది మన దేశ విద్యార్థులు ఇతర దేశాల్లో ఉద్యోగం పొందలేక, ఇక్కడికి రాలేక ఇబ్బందులు పడుతున్నారు. పైన చెప్పిన నైపుణ్యాలన్నీ పెంచుకొంటే మన దేశంలోనూ ఉపాధి అవకాశాలున్నాయి.

వివిధ మల్టీ నేషనల్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలతో పాటు సైబర్‌ సెక్యూరిటీ రంగంలో మాల్వేర్‌ అనాలిసిస్, ఎథికల్‌ హాకింగ్, డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌ లాంటి విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా జాబ్​పొందే ప్రయత్నం చేయండి. వీలుకాని పక్షంలో నౌక్రీ డాట్‌ కాం, లింక్డ్‌ ఇన్, ఇండీడ్‌ ఇండియా, మాన్‌స్టర్‌ ఇండియా లాంటి వెబ్‌సైట్లలో రిజిస్టర్‌ చేసుకొని జాబ్ ట్రైల్స్ చేయండి.