Do you know these places where petrol is very cheap?
World Cheapest Petrol: నీళ్ల కంటే పెట్రోల్ చాలా చౌకగా దొరికే ఈ ప్రదేశాల గురించి మీకు తెలుసా..? ఇక్కడ లీటర్ 2 రూపాయలే..!
నేడు ప్రతి ఇంటికి రెండు, మూడు కంటే ఎక్కువ వాహనాలే ఉన్నాయి. కార్లు, బైకులు ఇలా ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి ఉన్నాయి. పెట్రోల్ లేకుండా అవి నడపడం కష్టం. కానీ, ఇంధన ధరలు రోజు రోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో మధ్యతరగతి ప్రజలకు ఇది ఆందోళన కలిగించే విషయం.. ఎందుకంటే ఒకసారి కారు కొనడం సులభం. కానీ, నేటి ద్రవ్యోల్బణ కాలంలో వాహనంలో పెట్రోల్ నింపడమే జేబుపై భారాన్ని మోపుతుంది. ఈ రోజు మనం నీటి కంటే పెట్రోల్ చౌకగా లభించే 10 దేశాల పేర్లను తెలుసుకోబోతున్నాం..అవేంటంటే..
అత్యంత చౌకైన పెట్రోల్ ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?:
చౌకైన పెట్రోల్ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఉంటారు. అయితే, మీ కోసమే ఈ వార్త.. వెనిజులాలో పెట్రోల్ అతి తక్కువ ధరకు లభిస్తుంది. అవును, అక్కడ పెట్రోల్ లీటరుకు కేవలం రూ. 2.51కే లభిస్తుంది. కార్లంటే ఇష్టపడే అక్కడి ప్రజలకు ఇది గొప్ప విషయం. తక్కువ ధరకే లగ్జరీ కార్లు కొనాలనే తమ మక్కువను తీర్చుకోగలరు.
పెట్రోల్ నీటి ధరకు లభించే దేశం:
పెట్రోల్ చాలా చౌకగా లభించే ఇరాన్ 2వ స్థానంలో ఉంది. నీటికి పెట్రోల్ లభించే మూడవ స్థానంలో అంగోలా ఉంది. నాల్గవ స్థానంలో ఉన్న అల్జీరియాలో పెట్రోల్ లీటరుకు రూ. 28.47గా ఉంది. కువైట్ ఐదవ స్థానంలో ఉంది. ఇక్కడ పెట్రోల్ లీటరుకు రూ. 29.25 కు లభిస్తుంది.
ఈ దేశాలలో కూడా పెట్రోల్ చౌకగా లభిస్తుంది:
పెట్రోల్ చౌకగా లభించే దేశాల్లో నైజీరియా ఆరో స్థానంలో ఉంది. ఇక్కడ లీటరుకు రూ. 29.45 ధర ఉంది. తుర్క్మెనిస్తాన్ ఏడవ స్థానంలో ఉంది. ఇక్కడ పెట్రోల్ లీటరుకు రూ. 29.50. కజకిస్తాన్ ఎనిమిదవ స్థానంలో ఉంది. ఇక్కడ పెట్రోల్ లీటరుకు రూ. 37.26. తొమ్మిదవ స్థానంలో ఇథియోపియా పేరు వస్తుంది. అది ఒక పేద దేశం, కానీ ఇక్కడ పెట్రోల్ చాలా చవకగా లభిస్తుంది. ఇక మలేషియా పదో స్థానంలో ఉంది. ఇక్కడ పెట్రోల్ లీటరుకు రూ. 39.80.లకే లభిస్తుంది.
ఈ దేశంలో పెట్రోల్ అత్యంత ఖరీదు:
ఇకపోతే, పెట్రోల్ అత్యంత ఖరీదైన దేశం ఏదో తెలుసుకుందాం. అది భారతదేశం కాదు, పాకిస్తాన్ కాదు. ఆ దేశం పేరు హాంకాంగ్. అవును అక్కడ ఒక లీటరు పెట్రోల్ ధర లీటరుకు రూ. 294.49. ధర పలుకుతుంది.