Chicken born with four legs
Telangana: ఓర్నాయనో.. నాలుగు కాళ్ళతో కోడి పిల్ల జననం.. బ్రహ్మంగారు చెప్పిందే నిజమవుతోందిగా..
ప్రపంచంలో ప్రకృతికి విరుద్ధంగా ఆవు పంది పిల్లకు పాలు ఇవ్వడం, కుక్క పిల్లి స్నేహం, మేకకు మనిషి రూపంలో పిల్ల ఇలా అనేక వింత సంఘటనలు గురించి తరచుగా వింటూనే ఉన్నాం. ముఖ్యంగా గత కొద్ది కాలంగా సోషల్ మీడియా వేదికగా అనేకానేనక వింత సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.
గత కొద్ది రోజులుగా కోడిపిల్లలు వింతవింతగా జన్మించాయనే వార్తలు తరచుగా వింటున్నాం.. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ కోడి నాలుగు కాళ్ల కోడి పిల్లకు జన్మనిచ్చింది. ఈ సంఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. కోడి పిల్లను చూసేందుకు పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివస్తున్నారు. ఈ సంఘటన రాగబోయిన గూడెంలో చోటుచేసుకుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రాఘబోయినగూడెంలో ఓ కోడి నాలుగు కాళ్లతో కోడి పిల్లకు జన్మించింది. ఈసాల పగడయ్య అనే గిరిజన వ్యక్తి ఇంట్లో గత పది రోజుల క్రితం నాలుగు కాళ్ల కోడి పిల్ల జన్మించింది. కోడి 20గుడ్లపై పొదిగి 15 పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఒక కోడి పిల్ల నాలుగు కాళ్ళతో జన్మించింది. పైగా ఈ కోడిపిల్ల ఆరోగ్యంగానే ఉన్నట్టు ఇంటి యజమాని తెలిపారు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ఈ అరుదైన సంఘటన పట్ల వింత జీవిగా భావించి తాండోప తండాలుగా తరలి వచ్చి చూసి వెళ్తున్నారు.
గ్రామస్తులు నాలుగు కాళ్లతో కోడి పిల్ల పుట్టడంతో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే కోణంలో భయపడుతున్నారు. డాక్టర్లు గాని సైంటిస్టులు గాని దీనిపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. అయితే కొందరు ఇదంతా శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో కలియుగంలో ఇలాంటి అనేక వింతలూ విశేషాలు జరుగుతాయని చెప్పిన విషయం కొంతమంది గుర్తు చేసుకుంటున్నారు.