headphones - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

headphones

25_02

How dangerous are headphones and earphones?

కర్ణభేరి పగిలిపోతుంది.. చెవిటి వారు కూడా కావొచ్చు.. వామ్మో.. హెడ్‌ఫోన్స్, ఇయర్‌ఫోన్స్ ఎంత ప్రమాదకరమంటే..

How dangerous are headphones and earphones?

మీరు హెడ్‌ఫోన్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటే ఈ వార్త తప్పక చదవండి. రోజంతా హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్‌లను ఉపయోగించడం మొత్తం ఆరోగ్యానికి ప్రమాదకరం... ఇది వినికిడి లోపంతో పాటు అనేక సమస్యలను కలిగిస్తుంది. ఒక్కోసారి కర్ణభేరి కూడా పగిలిపోయే ప్రమాదం ఉంది.. హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్‌లను ఉపయోగించడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి..? నిపుణులు ఏమి చెబుతున్నారు.. ఈ విషయాలను తెలుసుకోండి..

డిజిటల్ యుగంలో.. అరచేతిలో స్మార్ట్ ఫోన్.. అంతేకాకుండా దానికి తగినట్లు హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్‌లు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. చాలా మంది యువత ఇయర్ ఫోన్ లేకుండా ఇంటి నుంచి బయటకు అడుగు కూడా వేయలేరు.. సంగీతం వినడం, వీడియోలు చూడటం లేదా కాల్స్ అటెండ్ చేయడం వంటివి అయినా.. చాలా చోట్ల హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్‌లు ఉపయోగిస్తున్నారు. ప్రజలు గంటల తరబడి హెడ్‌ఫోన్‌లు ధరిస్తూనే ఉంటారు.. అయితే.. హెడ్‌ఫోన్‌లను నిరంతరం ఉపయోగించడం వల్ల మీ చెవులు ఎంతగా దెబ్బతింటాయో మీకు తెలుసా..? మీ వినికిడి శక్తి కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.. ఇంకా మీరు శాశ్వతంగా చెవిటివారు కావచ్చు. ప్రతిరోజూ ఎన్ని గంటలు హెడ్‌ఫోన్‌లను ఉపయోగించడం సరైనది..? నిపుణుల ఏం చెబుతున్నారు..? ఈ వివరాలను తెలుసుకోండి..

మీరు కూడా రోజంతా హెడ్‌ఫోన్‌లు ధరిస్తే ఈ వార్త మీకు ముఖ్యం. ఎందుకంటే నేడు చాలా మంది రోజంతా హెడ్‌ఫోన్‌లు ధరించి పని చేస్తున్నారు.. ఇంట్లో, ఆఫీసులో, మార్కెట్‌లో కూడా ప్రజలు తమ చెవుల్లో హెడ్‌ఫోన్‌లను ఉంచుకుంటారు. ఇంకా కొంతమంది రాత్రిపూట చెవుల్లో హెడ్‌ఫోన్‌లు పెట్టుకుని నిద్రపోతారు.. మరికొందరు ప్రయాణాల్లో ఉన్నా కానీ.. ఎక్కువగా ఇయర్‌ఫోన్‌లనే ఉపయోగిస్తారు.. కానీ ఎల్లప్పుడూ హెడ్‌ఫోన్‌లను ఉపయోగించడం లేదా ఎక్కువసేపు గంటల తరబడి పాటలు వినడం వల్ల చెవుల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కర్ణభేరి కూడా పగిలిపోవచ్చు. దీనివల్ల మీరు చెవుడు బారిన పడే అవకాశం ఉంది. 60 నిమిషాల కంటే ఎక్కువ హెడ్‌ఫోన్‌లను ఉపయోగించకూడదని… 60% కంటే ఎక్కువ వాల్యూమ్‌లో వినకూడదని నిపుణులు చెబుతున్నారు.

మీరు హెడ్‌ఫోన్‌లను ఉపయోగిస్తుంటే.. వాటిని కొద్దిసేపు మాత్రమే ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.. అలాగే దీనిని 1 గంట కంటే ఎక్కువసేపు ఉపయోగించకూడదు. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లోని ENT విభాగంలో మాజీ నివాసి డాక్టర్ కృష్ణ కుమార్ హెడ్‌ఫోన్‌ల కోసం 60-60 నియమాన్ని అవలంబించవచ్చని చెప్పారు. దీని అర్థం హెడ్‌ఫోన్‌లను 60 నిమిషాల కంటే ఎక్కువ ఉపయోగించకూడదు.. వాల్యూమ్ 60% కంటే ఎక్కువగా ఉంచకూడదు.. మీరు దీని కంటే ఎక్కువసేపు హెడ్‌ఫోన్‌లను ధరిస్తే, చెవులపై ఒత్తిడి పెరుగుతుంది, ఇది మీ వినికిడి సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

మీరు హెడ్‌ఫోన్లను ఎక్కువగా ఉపయోగిస్తే, అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తాయి. ఇది మీ వినికిడి సామర్థ్యాన్ని నాశనం చేయడమే కాకుండా, తలనొప్పి, తలతిరుగుడు, గందరగోళానికి కూడా కారణమవుతుంది. అందువల్ల, దీని రోజువారీ వాడకాన్ని తగ్గించాలి.

ఇయర్, హెడ్‌ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగించడం ఎందుకు హానికరం?

హెడ్‌ఫోన్‌ల నుంచి వెలువడే పెద్ద శబ్దం నేరుగా చెవుల్లోకి వెళుతుంది. ఇది చెవి లోపల ఉన్న చిన్న కణాలను దెబ్బతీస్తుంది. ఈ కణాలు మన వినికిడి సామర్థ్యాన్ని నిర్వహిస్తాయి. ఇవి దెబ్బతిన్నట్లయితే, వినికిడి లోపం క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.

ఇయర్,  హెడ్‌ఫోన్‌లు ఉపయోగిస్తున్నప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

గాడ్జెట్ల వాల్యూమ్ 60% కంటే ఎక్కువగా ఉంచకూడదు.

మీరు హెడ్‌ఫోన్‌లతో ఎక్కువసేపు పని చేయాలనుకుంటే.. ప్రతి 30-40 నిమిషాలకు విరామం తీసుకోండి.

చెవులకు ఉపశమనం కలిగించడానికి ఇయర్‌ఫోన్‌లకు బదులుగా హెడ్‌ఫోన్‌లను వాడండి.. ఎందుకంటే ఇయర్‌ఫోన్‌లు నేరుగా చెవిలోకి వెళ్లి ఎక్కువ హాని కలిగిస్తాయి.

వీలైతే, చెవులపై తక్కువ ప్రభావం ఉండేలా స్పీకర్లను ఉపయోగించండి.

తక్కువ వాల్యూమ్‌లో కూడా స్పష్టమైన ధ్వనిని వినగలిగేలా ఉండే హెడ్‌ఫోన్‌లను ఉపయోగించండి.

బ్లూటూత్ – వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌ల నుండి వచ్చే రేడియేషన్‌ను నివారించడానికి, వాటిని వీలైనంత తక్కువగా వాడండి.