Study in US - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

Study in US

25_02

 Are you planning to study in America?

Study in US : అమెరికాలో చదువుకు ప్లాన్​ చేస్తున్నారా?  

Are you planning to study in America?

అమెరికాలో టాప్​ యూనివర్సిటీ లిస్ట్​ చూసేయండి..
అమెరికాలో చదువుకోవాలని చాలా మంది కలలుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇండియా నుంచి అమెరికాకు వెళుతున్న విద్యార్థుల సంఖ్య ప్రతియేటా పెరుగుతోంది. మరి మీరు కూడా యూఎస్​లో చదువుకు ప్లాన్​ చేస్తున్నారా? ఏ యూనివర్సిటీలో చదువుకుంటే మంచిది? అని ఆలోచిస్తున్నారు? అయితే ఇది మీకోసమే! ఒక యూనివర్సిటీని ఎంపిక చేసేందుకు చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. అయితే, టైమ్స్​ హయ్యర్​ ఎడ్యుకేషన్ (టీహెచ్​ఈ)​ విడుదల చేసిన వరల్డ్​ రెప్యుటేషన్​ ర్యాంకింగ్​ 2025 లిస్ట్​ కూడా మీకు ఉపయోగపడుతుంది. ఈ లిస్ట్​లో ఉన్న అమెరికన్​ విశ్వవిద్యాలయాలను తెలుసుకుని మీరు ప్లాన్​ చేసుకోవచ్చు.

టీహెచ్​ఈ వరల్డ్​ రెప్యుటేషన్​ ర్యాంకింగ్​ 2025 : అమెరికా వర్సిటీలు- ర్యాంకులు..

హార్వర్డ్​ యూనివర్సిటీ- 1వ ర్యాంక్​
మసాచుసెట్స్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ (ఎంఐటీ)- 2వ ర్యాంక్​
స్టాన్​ఫర్డ్​ వర్సిటీ- 4
యూనివర్సిటీ ఆఫ్​ కాలిఫోర్నియా, బెర్క్​లే- 6
ప్రిన్స్​టన్​ యూనివర్సిటీ- 7
యేలే యూనివర్సిటీ- 9
కాలిఫోర్నియా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ (కాల్​టెక్​)- 13
యూనివర్సిటీ ఆఫ్​ కాలిఫోర్నియా (లాస్​ఏంజెల్స్​)- 15
యూనివర్సిటీ ఆఫ్​ చికాగో- 16
కొలంబియా యూనివర్సిటీ- 17
యూనివర్సిటీ ఆఫ్​ మిషిగాన్​- 18
కార్నెల్​ యూనివర్సిటీ- 20
యూనివర్సిటీ ఆఫ్​ పెన్సిల్వేనియా- 22
జాన్స్​ హాప్​కిన్స్​ యూనివర్సిటీ- 23
యూనివర్సిటీ ఆఫ్​ వాషింగ్టన్​- 26
న్యూయార్క్​ యూనివర్సిటీ- 28
డ్యూక్​ యూనివర్సిటీ- 29
కార్నెగే మిలోన్​ యూనివర్సిటీ- 31
యూనివర్సిటీ ఆఫ్​ ఇల్లినాయిస్​ (అర్బనా షాంపైన్​)- 31
యూనివర్సిటీ ఆఫ్​ టెక్సాస్​ (ఆస్టిన్​)- 35
యూనివర్సిటీ ఆఫ్​ కాలిఫోర్నియ (సాన్​డియాగో)- 36
యూనివర్సిటీ ఆఫ్​ విస్కాన్సిస్​ (మాడిసన్​)- 38
మీరు గమనిస్తే టైమ్స్​ హయ్యర్​ ఎడ్యుకేషన్​ విడుదల చేసిన వరల్డ్​ రెప్యుటేషన్​ ర్యాంకింగ్​ 2025 లిస్ట్ టాప్​ 10లో 6 అమెరికాలోని విశ్వవిద్యాలయే ఉన్నాయి. వీటిల్లో చదువుకు అవకాశం లభిస్తే, చాలా నేర్చుకోవచ్చని, మంచి ఉద్యోగం పొందవచ్చని చాలా మంది భావిస్తుంటారు.

మరోవైపు భారత్​కు చెందిన కొన్ని యూనివర్సిటీలు కూడా ఈ లిస్ట్​లో చోటు సంపాదించుకున్నాయి. ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ సైన్స్​కి ఈ లిస్ట్​లోని 201-300 ర్యాంకింగ్స్​లో చోటు దక్కింది. ఐఐటీ దిల్లీ, ఐఐటీ మద్రాస్​ కూడా ఇందులోనే ఉన్నాయి.