Online Order Scam
ఒక్క కాల్ ఉచ్చులో పడేసింది.. ఆన్‌లైన్ ఆర్డర్ ఇంకా లేదని ఫోన్ చేసింది.. తర్వాత ఏం జరిగిందో తెలుసా..?
Online Order: ఒక్క పొరపాటు చిక్కుల్లో పడేసింది. ఆన్‌లైన్ ఆర్డర్ ఆమెను నిలువునా ముంచేసింది. ఈ రోజుల్లో ఏది చేసినా ఆచితూచి అడుగులు వేయడం చాలా ముఖ్యం. ఓ మహిళ చేసిన ఫోన్ కాల్ సమస్యల్లో పడేసింది. ఆలోచన లేకుండా చేసిన పని వేలాది రూపాయలు పోగొట్టుకుంది. తీర మోసపోయానని తెలుసుకుని లబోదిబోమంది. చేసేదేమి లేక పోలీసులను ఆశ్రయించింది.
ఇంతకీ ఆ మహిళకు ఏం జరిగింది.. ?
ఈ రోజుల్లో ఆన్‌లైన్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసగిస్తున్నారు. పాట్నాకు చెందిన ఒక మహిళ విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. ఆమె ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ నుండి కొన్ని వస్తువులను ఆర్డర్ చేసింది. వస్తువులు సమయానికి రాలేదు. వెంటనే ఆమె కంపెనీనీ సంప్రదించాలని భావించింది. ఇందు కోసం ఇంటర్నెట్‌లో కంపెనీ నంబర్‌ను సంపాదించి కాల్ చేసింది. ఇంకెముంది స్కామర్ల ఉచ్చులో చిక్కుకుంది. స్కామర్లు ఆమె నుంచి వేలాది రూపాయలు క్షణాల్లోనే మంయ చేశారు.
మోసం ఎలా జరిగింది?
పాట్నాకు చెందిన ఒక మహిళ ఫిబ్రవరి 6న మిక్సర్ మెషీన్‌ను ఆర్డర్ చేసింది. ఈ ఉత్పత్తి ఫిబ్రవరి 12 నాటికి రావాల్సి ఉంది. అది సమయానికి రాకపోవడంతో ఆ మహిళ కారణం తెలుసుకోవడానికి కంపెనీని సంప్రదించాలని నిర్ణయించుకుంది. దీని తర్వాత ఆమె ఇంటర్నెట్‌లో కంపెనీ నంబర్ కోసం వెతికింది. తర్వాత ఆ నంబర్‌ను సంప్రదించినప్పుడు, కాల్ స్కామర్‌లకు వెళ్లింది. స్కామర్లు తమ మాటలతో ఆమెను ఆకర్షించి అవసరమైన సమాచారాన్ని సేకరించారు. ఇంకేముందు ఆ మహిళ ఖాతా నుండి రూ. 52,000 విత్‌డ్రా చేసుకున్నారు. దీని తర్వాత ఆ మహిళ ఈ సంఘటన తర్వాత మోసపోయానని భావించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.