Even if WhatsApp is open, no one can read your messages.
WhatsApp Tips: వాట్సాప్ ఓపెన్ చేసి ఉన్నా, మీ మెసేజ్‌లను ఎవరూ చదవలేరు.. ఈ సెట్టింగ్ చేయండి!
WhatsApp Tips: వాట్సాప్.. ఇది ప్రతి ఒక్కరి మొబైల్‌లో ఉంటుంది. వాట్సాప్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. అయితే వాట్సాప్‌లో వచ్చే కొన్ని మెసేజ్‌లు ఇతరులు చూస్తారనే ఆందోళన ఉంటుంది. అలాంటి వాటిని ఎవ్వరు చూడకుండా కూడా చేసుకునే సదుపాయం ఉంది. ఈ ట్రిక్ ఎంటో చూద్దాం..
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది చాలా ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్. అయితే, కొన్నిసార్లు ప్రజలకు దీని గురించి కొన్ని గోప్యతా సమస్యలు ఉంటాయి. చాలా సార్లు, మీ ఫోన్ స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుని వద్ద ఉంటే, ప్రత్యేకమైన వ్యక్తి నుండి సందేశం వస్తే ఎవరు చూస్తారో..? ఏం జరుగుతుందో ఆందోళన చెందుతుంటారు.
మీ ఈ ఆందోళనను తొలగించడానికి ఓ ట్రిక్ ఉంది. ఇందులో మీ సందేశాలను ఎవ్వరు కూడా చూడలేరు. మీ సందేశాలు కూడా సురక్షితంగా ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైన, సురక్షితమైన ఫీచర్. దీన్ని ఆన్ చేయడానికి మీరు ఈ ట్రిక్స్ అనుసరించాల్సి ఉంటుంది.
ముందుగా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ తెరవండి. ఇప్పుడు మీరు దాచాలనుకుంటున్న చాట్‌ను ఎంచుకోండి. మీ స్క్రీన్ కుడి ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కల చిహ్నాన్ని నొక్కండి.
ఇక్కడ మీరు "లాక్ చాట్" ఎంపిక కనిపిస్తుంటుంది. దానిపై నొక్కండి. మీ స్క్రీన్‌పై “ఈ చాట్‌ను లాక్ చేసి దాచి ఉంచండి” అనే పాప్-అప్ కనిపిస్తుంది. దానిని ఎంపిక చేసుకోండి. ఎంచుకున్న చాట్‌ను లాక్ చేయడానికి "కొనసాగించు" అనే ఆప్షన్‌పై నొక్కండి.
ఈ విధంగా మీరు ఆ వాట్సాప్ చాట్‌లను లాక్ చేయవచ్చు. దీన్ని మీ ఫోన్ బయోమెట్రిక్స్ - ఫేస్, వేలిముద్ర ద్వారా మాత్రమే ఓపెన్ చేసుకోవచ్చు. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే చాట్‌లు లాక్ అయినప్పుడు నోటిఫికేషన్ కంటెంట్, పరిచయాలు దాచి ఉంటాయని గుర్తించుకోండి. వాట్సాప్ లాక్ చేయబడిన చాట్‌కు సంబంధించిన 1 కొత్త సందేశం నోటిఫికేషన్‌లో కనిపిస్తుంది.
చాట్‌ను అన్‌లాక్ చేయడానికి: మీరు ఈ చాట్‌లను అన్‌లాక్ చేయాలనుకుంటే, మీరు ఆ వ్యక్తి చాట్‌కి వెళ్లి, అక్కడి నుండి ప్రొఫైల్‌కి వెళ్లండి. ఇక్కడ మీకు లాక్ చేయబడిన చాట్‌ను అన్‌లాక్ చేసే ఎంపిక ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి.