A four-year-old girl swallowed a five-rupee coin.
Telangana: ఐదు రూపాయల కాయిన్ మింగిన నాలుగేళ్ల చిన్నారి.. గొంతులో ఇరుక్కోవడంతో..!
చిన్న పిల్లలు ఆడుకుంటూ ఏదో ఒక వస్తువు నోటిలో పెట్టుకుంటారు. ఆహార పదార్థాలు తినే క్రమంలో కొన్ని వస్తువులను కూడా తినడానికి ప్రయత్నం చేస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో ప్రమాదవశాత్తూ గొంతులో ఇరుక్కోవడం.. లేదా లోపలికి మింగడం చేస్తారు. తల్లి తండ్రులు జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. దీని వలన ప్రాణాపాయం సంభవించవచ్చు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. తాజాగా నాలుగు సంవత్సరాల చిన్నారి ఆడుకుంటూ ఐదు రూపాయల కాయిన్ మింగడంతో ఊపిరాడక ఇబ్బంది పడ్డాడు.
ఖమ్మం జిల్లా పాండురంగాపురంలో నాలుగేళ్ల చిన్నారి ఆడుకుంటూ కాయిన్ మింగేశాడు. మోతీలాల్, శైలజ కుమారుడు ప్రద్యుత్ ఐదు రూపాయల కాయిన్‌తో ఆడుకుంటూ.. ఒక్కసారిగా కాయిన్ నోట్లో పెట్టుకుని మింగడంతో అది గొంతులో ఇరుక్కపోయింది. ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్న చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
పిల్లలు ఏవైనా వస్తువులు మింగితే వాటిని ఆపరేషన్ లేకుండా బయటకు తీయడంలో ఎక్సపర్ట్ డాక్టర్ సునీల్‌బాబు దగ్గరు తీసుకొచ్చారు తల్లిదండ్రులు. చిన్నారిని పరీక్షించిన డాక్టర్ గొంతులోని కాయిన్‌ను ఎండోస్కోపీ ద్వారా ఆపరేషన్ లేకుండా బయటకు తీసి ప్రాణాలు కాపాడాడు. చావు బతుకుల మధ్య ఉన్న బాబును కాపాడిన డాక్టర్‌కు బాబు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.