Is it better to toast bread.. is it better to eat it alone.. what do the doctors say..
Bread vs toast : బ్రెడ్‌ను టోస్ట్ చేయడం మంచిదా.. ఉత్తిదే తినడం బెటరా.. డాక్టర్లు ఏం చెప్తున్నారంటే..
మన రోజువారీ ఆహారంలో బ్రెడ్ ఒక ముఖ్యమైన ఆహారం. కొంతమంది ప్లెయిన్ బ్రెడ్ తినడానికి ఇష్టపడతారు, మరికొందరు దానిని టోస్ట్ చేసి తినడానికి ఇష్టపడతారు. ప్రతి ఒక్కరూ రొట్టెను వివిధ రకాలుగా తింటారు. కానీ బ్రెడ్ తినడానికి సరైన మార్గం మీకు తెలుసా? దీని గురించి హెల్త్ కోచ్ లు చెప్తున్న వివరాల ప్రకారం.. బ్రెడ్‌ను కాల్చి తినడం మంచిదని అంటున్నారు. దీని వెనుక పలు కారణాలను కూడా వారు వివరిస్తున్నారు.
బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ తీసుకోవడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. దీంతో పాటు గుడ్లు సలాడ్లు, బటర్ వంటివి తీసుకుంటుంటారు. ఇలా తీసుకోవడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. వీటికి తాజా కూరగాయలను జత చేయడం, శాండ్విచ్ ల రూపంలో తీసుకోవడం చేస్తుంటారు. బరవు తగ్గాలనుకునే వారు సైతం బ్రెడ్ లేకుండా రోజును మొదలుపెట్టరు. మరి రోజూ ఇలా బ్రెడ్ ను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా..? దీని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగయంగా టేస్టీగా ఉండే బ్రెడ్ ను ఎలా తినాలి అనే విషయాలు ప్రముఖ ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అవేంటో మీరూ తెలుసుకోండి.
గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి..
బ్రెడ్ టోస్ట్ చేయడం వల్ల రక్తంలో చక్కెర మరియు గ్లూకోజ్ స్థాయిలు 25 శాతం కంటే ఎక్కువ తగ్గుతాయి. ఎందుకంటే, మనం బ్రెడ్‌ను టోస్ట్ చేసినప్పుడు, ఒక రసాయన ప్రతిచర్య సంభవిస్తుంది. దానిలోని కార్బోహైడ్రేట్లు మరియు నీటి శాతం తగ్గుతుంది, దీని వలన బ్రెడ్ సులభంగా జీర్ణమవుతుంది. ఇందులో ఉండే చిన్న కేలరీలు మరియు చక్కెరలు నెమ్మదిగా రక్తప్రవాహంలోకి విడుదలవుతాయని వారు చెప్తున్నారు.
కేలరీలు..
టోస్ట్ చేసిన బ్రెడ్‌లో కూడా సాధారణ బ్రెడ్ లో ఉండే అంతే కేలరీలు ఉంటాయి. బ్రెడ్ టోస్ట్ చేయడం వల్ల కార్బోహైడ్రేట్లు ప్రభావితం కావు. బ్రెడ్‌ను వేడి చేయడం వల్ల దానిలోని స్టార్చ్ కంటెంట్ మారుతుంది. ఇది బ్రెడ్‌లోని తేమను కూడా తగ్గిస్తుంది. దీనివల్ల కొంతమందికి టోస్ట్ చేసిన బ్రెడ్ తినడం సులభం అవుతుందని ఆయన అన్నారు.
గ్లైసెమిక్ ఇండెక్స్..
టోస్ట్ చేసిన బ్రెడ్‌లో సాదా బ్రెడ్ కంటే కొంచెం తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందని చందూర్కర్ అన్నారు. ఇది రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుందని కూడా ఆయన అన్నారు.
గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి మరొక మార్గం బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో ఉంచడం. ఒక సాధారణ బ్రెడ్ ముక్క తీసుకోండి. దానిని ఒక పెట్టెలో లేదా కంటైనర్‌లో ఉంచండి. తర్వాత ఆ పెట్టెను ఫ్రిజ్‌లో పెట్టండి. మరుసటి రోజు, మీరు ఆ రొట్టెను టోస్ట్ చేసి తినండి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను 40 శాతం తగ్గిస్తుంది. ఎందుకంటే మనం బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు, అది రెసిస్టెన్స్ స్టార్చ్‌ను ఏర్పరుస్తుంది, ఇది గట్ బాక్టీరియాకు మంచిది.
బ్రెడ్ టోస్ట్ చేసేటప్పుడు, పోషకాలు తక్కువగా ప్రభావితమవుతాయి. కానీ అధిక ఉష్ణోగ్రతల వద్ద బ్రెడ్‌ను కాల్చేటప్పుడు, అక్రిలామైడ్ ఏర్పడుతుంది, ఇది చాలా ప్రమాదకరమైనదని చెప్తున్నారు.