CONGRESS LEADER JAGGA REDDY MOVIE
పాన్ ఇండియా సినిమా చేస్తున్న 'జగ్గారెడ్డి' - ఊరమాస్ లుక్‌లో పోస్టర్.
సినిమాలో నటిస్తున్నా పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి - ఫస్ట్ పోస్టర్ విడుదల.
Congress Leader Jagga Reddy Acting In Jagga Reddy Movie : నటీనటులు సినిమాల్లో నుంచి రాజకీయాలకు రావడం, వారు ముఖ్యమంత్రులు, ఉన్నత పదవుల్లో సేవలు చేయడం చూశాం. అలాగే రాజకీయ నాయకులు సినిమాలను నిర్మించడం కూడా ఎన్నో చూశాం. రాజకీయ నాయకులను అనుకరిస్తూ సినిమాల్లో నటించడం చూశాం. తాజాగా వీటికి భిన్నంగా కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే తాను సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించి ఆ సినిమా ఫస్ట్ పోస్టర్‌ను సైతం విడుదల చేశారాయన. ఆ సినిమా పేరే జగ్గారెడ్డి. వార్ ఆఫ్ లవ్ అనే ఉప శీర్షికతో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుందని ప్రకటింటారు. ఈ వార్త విన్న రాజకీయ నేతలు, సినీ ప్రియులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే,
వారి అనుమతితో సినిమా చేస్తున్న :
తాను త్వరలో ఒక సినిమాలో నటించబోతున్నట్లు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసేందుకు దిల్లీ వెళ్లిన ఆయన సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాకు ఈ విషయం చెప్పారు. జగ్గారెడ్డి టైటిల్‌తో వార్ ఆఫ్ లవ్ అనే ఉప శీర్షికతో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రంలో తాను మాఫియాను ఎదిరించి ప్రేమికులకు వివాహం చేసే ప్రధాన నాయకుడి పాత్ర పోషించబోతున్నానని జగ్గారెడ్డి వివరించారు. ఇది తన నిజ జీవిత వ్యక్తిత్వాన్ని పోలి ఉంటుందని అన్నారు. వచ్చే సంవత్సరం ఉగాది నాటికి జగ్గారెడ్డి’ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అనుమతితోనే తాను ఈ సినిమాలో నటించబోతున్నట్లు తెలిపారు.
రాహుల్ గాంధీ టైం ఇస్తే అన్ని చెప్తా :
అలాగే ఎమ్మెల్సీ టికెట్ల కేటాయింపుపై మాట్లాడుతూ ఎన్నాళ్లుగానో కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్న జెట్టి కుసుమకుమార్‌కు ఈసారి అవకాశం వస్తుందని ఆశించినా రాలేదని జగ్గారెడ్డి విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కుసుమకుమార్ విషయం మాట్లాడాలనుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని పరిస్థితులను వివరించేందుకు తాను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టైం అడిగానని అన్నారు.