Mobile Internet - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

Mobile Internet

25_03

Internet is slow on your mobile..?  Do you know what are the main reasons?

Mobile Internet: మీ మొబైల్‌లో ఇంటర్నెట్‌ స్లో అవుతుందా..? ప్రధాన కారణాలు ఏంటో తెలుసా..?

Internet is slow on your mobile..?  Do you know what are the main reasons

Tech Tips: మొబైల్‌లో ఇంటర్నెట్‌ సమస్య తలెత్తినట్లయితే రకరకాల కారణాలు ఉండవచ్చు. వాటిని గుర్తించి సరి చేసుకుంటే మీ నెట్‌ స్పీడ్‌గా ఉంటుంది. మీ మొబైల్‌లో ఇంటర్నెట్‌ స్లో కావడానికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసా..? దీని కోసం కొన్ని చిట్కాలు తెలుసుకోండి. దీంతో మీ ఇంటర్నెట్‌ సమస్యను పరిష్కరించుకోవచ్చు.

ఫోన్‌లో నెట్‌వర్క్ లేకుంటే లేదా అది నెమ్మదిగా ఉంటే మీరు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఇలా ఎందుకు జరుగుతుందోనని ఎప్పుడైనా గమనించారా? దీని కోసం కొన్ని చిట్కాలు తెలుసుకోండి. దీంతో మీ ఇంటర్నెట్‌ సమస్యను పరిష్కరించుకోవచ్చు.

బలహీనమైన సిగ్నల్ బలం: 

బలహీనమైన సిగ్నల్ కారణంగా నెట్‌వర్క్ సమస్యలు తలెత్తుతాయి. మీరు కవరేజ్ బలహీనంగా ఉన్న ప్రదేశంలో ఉంటే, మీరు ఫోన్‌లో ఇంటర్నెట్‌ ఉపయోగించడంలో ఇబ్బంది ఏర్పడవచ్చు. మీరు

నెట్‌వర్క్ రద్దీ: 

నెట్‌వర్క్ రద్దీ తరచుగా గరిష్ట వినియోగ సమయాల్లో సంభవిస్తుంది. దీని కారణంగా మీ ఇంటర్నెట్‌ స్లోగా ఉండవచ్చు. ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు Wi-Fi కి మారవచ్చు. Wi-Fi లేకపోతే తక్కువ డేటా అవసరమయ్యే యాప్‌లను మీరు ఉపయోగించవచ్చు. మీరు నెట్‌వర్క్‌ సరిగ్గా లేని ప్రాంతంలో ఉన్నట్లయితే ఇటర్నెట్‌లో సమస్యలు తలెత్తవచ్చు. దీంతో నెట్‌ నెమ్మదిగా కావచ్చు.

సాఫ్ట్‌వేర్‌ అపడేట్స్‌: 

అపడేట్స్‌ లేని సాఫ్ట్‌వేర్‌ను ఫోన్‌లో ఉంచుకోవడం వల్ల నెట్‌వర్క్ సేవలతో అనుకూలత సమస్యలు తలెత్తుతాయి. మీ ఫోన్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండండి. అప్‌డేట్‌ వచ్చినప్పుడు ఈ బగ్‌లను తొలగించండి.

SIM కార్డ్ సమస్యలు:

నెట్‌వర్క్ సరిగ్గా పనిచేయకపోవడానికి కారణం పాత SIM కార్డ్ కావచ్చు. లేదా సిమ్‌ను తప్పుగా వేయడం వల్ల కూడా నెట్‌వర్క్ సమస్యలు వస్తాయి. సిమ్ తీసి, అది సరిగ్గా వేశారో లేదో తనిఖీ చేయండి. ఇది మీ నెట్‌వర్క్‌ను మెరుగుపరుస్తుంది. మీ సిమ్‌ కార్డులో ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉన్నా ఇంటర్నెట్‌ సరిగ్గా రాదు. ఈ సిమ్‌ కార్డే సమస్య ఉంటే దాని స్థానంలో కొత్త సిమ్‌ను అంటే అదే నంబర్‌తో వేరే సిమ్‌ తీసుకోవడం ఉత్తమమని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

అదనంగా మైక్రోవేవ్‌లు, కార్డ్‌లెస్ ఫోన్‌లు లేదా ఇతర వైర్‌లెస్ నెట్‌వర్క్‌లు ఫోన్ నెట్‌వర్క్ పరిధిని ప్రభావితం చేయవచ్చు. అటువంటి పరిస్థితిలో అటువంటి డివైజ్‌ల చుట్టూ ఫోన్‌ను ఉపయోగించకుండా ఉండండి.