Father's death in childhood. Mother's difficulty. Both sons are promoted as ASIs - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

Father's death in childhood. Mother's difficulty. Both sons are promoted as ASIs

24_03

 Father's death in childhood. Mother's difficulty. Both sons are promoted as ASIs

చిన్నతనంలో నాన్న మృతి.. తల్లి కష్టం ఇద్దరు కొడుకులకు ఏఎస్ఐలుగా పదోన్నతులు.

Father's death in childhood. Mother's difficulty. Both sons are promoted as ASIs చిన్నతనంలో నాన్న మృతి.. తల్లి కష్టం ఇద్దరు కొడుకులకు ఏఎస్ఐలుగా పదోన్నతులు.

అమ్మ అంటే ప్రేమ నాన్న అంటే ఓ నమ్మకం పిల్లల ఎదుగుదల వెనుక వాళ్ళిద్దరు కష్టం ఉంటుంది. ఆ ఎదుగుదలకు కారణమైన తల్లిదండ్రులకు పిల్లలు ఎప్పటికీ ఋణపడి ఉంటారు. నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన తల్లికి ఉన్నత శిఖరాలకు చేరిన బిడ్డలు కళ్ళ ముందే కనిపిస్తుంటే ఆ తల్లికి సంతోషం వర్ణనాతీతం. తనను చదివించేందుకు తల్లి పడుతున్న కష్టాన్ని ఆ యువకులు మరువలేదు. ఉన్నత స్థానానికి చేరి మాతృమూర్తి కళ్లలో ఆనందం నింపడమే లక్ష్యంగా అహర్నిశలు కష్టపడి చదివారు. పరీక్షలో సత్తా చాటి ఉద్యోగానికి ఎంపికయ్యారు. పట్టుదల ఉండాలే గానీ సాధించలేనిదంటూ ఏదీ లేదని నిరూపించారు ఆ యువకులు.

యానాం పోలీసుస్టేషన్‌ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కొడుకులకు పుదుచ్చేరి ప్రభుత్వం ఏఎస్సైలుగా పదోన్నతి కల్పించింది. తమను ఇంతవారిని చేసిన మాతృమూర్తికి సెల్యూట్ చేయడంతో వారి తల్లి ఆనందంతో ఉప్పొంగి పోయింది. యానాంకు చెందిన కడలి మధు, మాధవ్ అనే ఇద్దరు అన్నదమ్ముళ్ళు కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. మధు, మాధవ్‌ది మధ్య తరగతి కుటుంబం. అనుకోని పరిస్థితుల్లో తండ్రి చనిపోయారు. వారి తల్లి ధైర్యం కోల్పోకుండా కుటుంబ భారాన్ని మోసింది. ఇద్దరు కొడుకులను శ్రద్ధగా చదివించ్చింది.

ఇద్దరు కొడుకులు కానిస్టేబుల్ గా ఎంపిక కావడంతో వారిని చూసి తల్లి మురిసిపోయింది. మధు, మాధవ్‌లు కూడా అంతే సంస్కారంతో ఏఎస్సైలుగా పదోన్నతి పొంది యూనిఫాంలో అమ్మ దగ్గరకు వచ్చి గర్వంగా తల్లికి సెల్యూట్ చేస్తూ పొంగిపోయారు. తండ్రి లేకపోయినా తల్లి ఆలనా పాలన చూసి కష్టపడి చదివించి కొడుకులు ఓ ఎత్తుకు ఎదిగితే ఆనందం వేరంటూ తల్లి మురిసిపోయింది.