The poor farmer who gave a big shock to the district collector.. Sabhash Venkatarayudu - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

The poor farmer who gave a big shock to the district collector.. Sabhash Venkatarayudu

24_03

The poor farmer who gave a big shock to the district collector.. Sabhash Venkatarayudu

జిల్లా కలెక్టర్‌కు బిగ్ షాక్ ఇచ్చిన పేద రైతు.. శభాష్ వెంకటరాయుడు.

The poor farmer who gave a big shock to the district collector.. Sabhash Venkatarayudu జిల్లా కలెక్టర్‌కు బిగ్ షాక్ ఇచ్చిన పేద రైతు.. శభాష్ వెంకటరాయుడు.

పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ రైతు వినూత్న నిరసన తెలిపాడు. రైతు తెలిపిన నిరసనకు ఇటు జిల్లావాసులు, అటు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మన్యం జిల్లాలో గత కొన్నేళ్లుగా ఏనుగుల గుంపు రెచ్చిపోతుంది. నిత్యం ఏదో చోట పంట పొలాలు, రైతుల ఆస్తులు ధ్వంసం చేస్తూనే ఉన్నాయి. ఏనుగుల దాడిలో ఇప్పటి వరకు పది మందికి పైగా మృత్యువాత పడగా, పదుల సంఖ్యలో గాయాల పాలయ్యారు.

మన్యం జిల్లాలో ప్రధానంగా కొమరాడ, గరుగుబిల్లి, కురుపాం మండలాల్లో ఏనుగుల సంచరిస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇంట్లో నుండి బయటకు రావాలంటేనే గుండెల్లో వణుకు మొదలవుతుంది. రైతులు పంట పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఏనుగుల గుంపు మరోసారి కొమరాడ మండలం గారవలస సమీపంలో రెచ్చిపోయాయి. గారవలస గ్రామానికి చెందిన వెంకట నాయుడు అనే రైతు తన పంట పొలాల్లో కూరగాయలు పండిస్తుంటాడు. అలా పండించిన కూరగాయలను సమీపంలోని పార్వతీపురం పట్టణానికి సైకిల్ పై తీసుకెళ్లి అమ్ముకొని జీవనం సాగిస్తుంటాడు. బస్సుల్లో కానీ, ఆటోలో కానీ కూరగాయలు తీసుకెళ్తే తనకు వచ్చే ఆదాయం ఆ చార్జీలకే సరిపోతుందనే ఉద్దేశ్యంతో ప్రతిరోజు సైకిల్ పైనే కూరగాయలు అమ్ముతుంటాడు.

ఎప్పటిలాగే ఉదయాన్నే తన స్వగ్రామం నుండి కూరగాయలు సైకిల్ పై తీసుకొని పార్వతీపురం పట్టణానికి బయలుదేరాడు. అలా కొంత దూరం వెళ్లేసరికి ఏనుగుల గుంపు సడన్ గా పంట పొలాల్లో నుండి రోడ్డుపైకి వచ్చింది. అప్పుడే అటుగా వస్తున్న వెంకటనాయుడును చూసిన ఏనుగుల గుంపు ఒక్కసారిగా అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. పరిస్థితి గమనించిన వెంకట నాయుడు సైకిల్‌ను రోడ్డు పైనే వదిలేసి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకున్నాడు. ఏనుగులు అక్కడే ఉన్న సైకిల్ ను ధ్వంసం చేశాయి. దీంతో తమ జీవనోపాధి అయిన సైకిల్‌ను, అలాగే కూరగాయలను ఏనుగులు తన కళ్ల ముందే ధ్వంసం చేయడానికి చూసి రగిలిపోయాడు. ఎలాగైనా సరే తనకు జరిగిన అన్యాయం పై అధికారులను నిలదీయాలని డిసైడ్ అయ్యాడు.

తనకు జరిగిన అన్యాయానికి పట్టరాని కోపంతో తన ధ్వంసమైన సైకిల్‌ను భుజాన వేసుకొని సుమారు 15 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వచ్చాడు. ఘటనా స్థలం నుండి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఆఫీస్ కి నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడ కలెక్టర్ ని కలిసి తన సైకిల్ చూపించి మీ వల్ల నాకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. రైతు వెంకటనాయుడు హావభావాలు చూసిన కలెక్టర్ నిషాంత్ కుమార్ ఖంగుతున్నాడు. ఏనుగులను కట్టడి చేయకపోవడం వల్లే జీవనోపాధిని కోల్పోవల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశాడు. దీంతో పరిస్థితి అర్థం చేసుకున్న కలెక్టర్ నిషాంత్ వెంకట్ నాయుడుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చి సర్ధి చెప్పారు. తక్షణమే వెంకటనాయుడును ఆదుకోవాలని అధికారులకు ఆదేశించారు. జరిగిన వ్యవహారం తెలుసుకున్న జిల్లావాసులు వెంకటనాయుడు చేసిన పనికి శభాష్ అని ప్రశంసిస్తున్నారు.