He is not a doctor.. God.. Medicine for the poor is only Rs.1..! - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

He is not a doctor.. God.. Medicine for the poor is only Rs.1..!

24_03

 He is not a doctor.. God.. Medicine for the poor is only Rs.1..!

ఈయన డాక్టర్‌ కాదు.. దేవుడు.. పేదలకు రూ.1కే వైద్యం..!

He is not a doctor.. God.. Medicine for the poor is only Rs.1..! ఈయన డాక్టర్‌ కాదు.. దేవుడు.. పేదలకు రూ.1కే వైద్యం..!

ఒడిశాలోని సంబల్‌పూర్‌ జిల్లాకు చెందిన శంకర్‌ రామచందని అక్కడి బుర్లా అనే ప్రాంతలో ఉన్న వీర్‌ సురేంద్ర సాయి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ (విమ్‌సర్‌) అనే ఇనిస్టిట్యూట్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అయితే గతంలో ఆయన అక్కడే సీనియర్‌ రెసిడెంట్‌గా ఉన్నాడు. కానీ ఆ బాధ్యతల్లో ఉంటే సొంతంగా ప్రైవేటు ప్రాక్టీస్‌ పెట్టేందుకు వీలు లేదు. అందువల్ల ఆయన రూ.1 హాస్పిటల్‌ పెట్టలేకపోయాడు. అయితే ఇటీవలే ఆయనకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పదోన్నతి లభించింది. దీంతో ఆ పదవిలో ఉంటే ప్రైవేటు ప్రాక్టీస్‌ పెట్టుకోవచ్చు. కనుక ఆయన తన ఇంట్లోనే రూ.1 క్లినిక్‌ను ప్రారంభించారు.

డాక్టర్‌ శంకర్‌ ఇటీవలే రూ.1 క్లినిక్‌ ప్రారంభించగా ఆ క్లినిక్‌కు చక్కని స్పందన లభిస్తోంది. ఎంతో మంది పేదలు నిత్యం ఆయన క్లినిక్‌ వద్దకు వైద్యసేవల కోసం వస్తున్నారు. ఆ క్లినిక్‌ను ప్రారంభించిన తొలి రోజు 30 మందికి పైగా వచ్చారంటే.. ఆయన పాపులర్‌ అయ్యారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు ఆయన క్లినిక్‌ ఉంటుంది. అక్కడ వైద్య సేవల కోసం ఎంతో మంది వస్తున్నారు.

ఇదే విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి చనిపోయాడని, ఆయన చనిపోయేందుకు ముందు ప్రైవేట్‌ క్లినిక్‌ పెట్టుకోమని సలహా ఇచ్చాడని, కానీ ఆ క్లినిక్‌ పెడితే పేదలకు ఇలా రూ.1కే వైద్యం చేయలేనని చెప్పానని, కనుకనే ప్రైవేటు హాస్పిటల్‌ను పెట్టలేదని తెలిపాడు. పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకే తాను ఇంట్లోనే క్లినిక్‌ను ఏర్పాటు చేశానని తెలిపాడు. ఇక రూ.1 ఎందుకు అనడిగితే.. అంత మొత్తం కూడా ఇవ్వకుండా వైద్యం అందించవచ్చు. కానీ వైద్యం కోసం వచ్చే వారికి మరీ ఉచితంగా సేవలు పొందడం కూడా ఇష్టం ఉండదు. రూ.1 అయితే తాము ఎంతో కొంత చెల్లించే వైద్య సేవలు పొందుతున్నామనే భావన కలుగుతుంది. ఉచితంగా వైద్యం పొందడం లేదని అనుకుంటారు. ఇది వారిని సంతృప్తిగా ఉంచుతుంది. అందుకనే రూ.1 తీసుకుంటున్నా.. అని తెలిపారు. ఈ డాక్టర్‌ లాంటి వారు దేశంలో అన్ని చోట్లా ఉంటే అప్పుడు పేదలు వైద్య సేవలకు ఇబ్బంది పడే అవకాశం ఉండదు కదా..!