Inspirational : The engineer who saved 165 crore liters of water.. and got rid of the drought in 26 villages.. Do you know somewhere?
Inspirational : 165 కోట్ల లీటర్ల నీటిని సేవ్ చేసి.. 26 గ్రామాల్లో ఉన్న కరువును పారదోలిన ఇంజనీర్.. ఎక్కడో తెలుసా?
Inspirational : జీవనం సాగించడానికి నీరు అత్యంత ప్రధానం. అందుకే నీరున్న చోట సంస్కృతి విలసిల్లుతుంది. పురాచన నాగరికతలన్నీ నదులున్న ప్రాంతాల్లో ఆవిర్భవించాయని మనకు తెలిసిందే. ఎందుకంటే నీరు లేకుండా మనిషి మనుగడ అసాధ్యం కాబట్టి. నీరు ఉంటే తాగడానికి, ఇతర అవసరాలకు పని కొస్తుంది. అలాగే పంటలు పండించాలన్నా.. చెట్లు పెంచాలన్న నీరు ముఖ్యం. నీరు లేకుంటే పంటలు పండవు. ఆహార కొరత ఏర్పడుతుంది. అదే ఒక ఇంజినీర్ ను తొలిచింది. మహారాష్ట్ర పూణేలో ఇంజినీర్ గా పనిచేస్తున్న గున్వంత్ సోనావానేను దృష్టికి ఈ సమస్య వచ్చింది. సేవా సహయోగ్ అనే ఎన్జీవోతో సహాయంతో 26 గ్రామాలను కరువు రహితంగా మార్చడానికి పూనుకుని విజయం సాధించాడు. అలాగే మహారాష్ట్ర అంతటా నీటి సంరక్షణ ప్రాజెక్టులను చేపట్టారు. మహారాష్ట్రలోని చాలీస్‌గావ్ తాలూకా ఆ రాష్ట్రంలోని అనేక కరువు పీడిత ప్రాంతాలలో ఒకటి. వేలాది మంది రైతుల జీవనోపాధిని అయిన వ్యవసాయం.. నీరు లేక పోవడంతో పూర్తిగా నష్టాల బారిన పడాల్సిన పరిస్థితి తలెత్తుతాయి ఆ ప్రాంతంలో.
తద్వారా తరచూ రైతు ఆత్మహత్యలు జరుగుతుంటాయి.సేవా సహయోగ్ అనే ఎన్జీవోతో కలిసి పని చేసిన గున్వంత్ సోనావానే.. కొన్ని సంవత్సరాల్లో 26 గ్రామాలకు కోట్ల లీటర్ల నీటిని ఆదా చేశాడు. దీని వల్ల 50 వేల మంది రైతులు ప్రయోజనం పొందారు. సేవా సహయోగ్ ఎన్జీవోతో కలిసి గున్వంత్ సోనావానే ఆరోగ్యం, విద్య మరియు నీటి సంరక్షణ రంగంలో పని చేస్తుంది. పిల్లల కోసం లైబ్రరీలను నిర్మించడం, అలాగే నగరంలో స్టడీ మెటీరియల్ మరియు కంప్యూటర్‌లను అందించడం ద్వారా నేను మురికివాడల అభివృద్ధికి స్వచ్ఛందంగా పని చేశాడు. అతని పనిని గుర్తింపుగా 2017లో న్యూయార్క్‌లో ADP ప్రెసిడెంట్ గ్లోబల్ CSR అవార్డు లభించింది. అతను ప్రైజ్ మనీగా 10 వేల డాలర్లు కూడా అందుకున్నాడు.గున్వంత్ తన కల్మడు మరియు పొరుగున ఉన్న ఇందాపూర్ గ్రామంలో వాటర్ ఫిల్టర్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి అవార్డు డబ్బును ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నాడు. తమ గ్రామంలో నీటి నాణ్యత తక్కువగా ఉందని మరియు స్వచ్ఛమైన మరియు తాగు నీరు పొందేందుకు గ్రామస్థులు ప్రతి రోజూ కష్టపడుతున్నట్లు గుర్తించానని చెబుతాడు గున్వంత్.
ఈ సమస్యలను పరిష్కరించేందుకు గున్వంత్ నీటి వడపోత ప్లాంట్లతో నివాసితులకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను చెప్పాడు.2017లో తీవ్ర నీటి సంక్షోభం కారణంగా ప్రభావితమైన రాజమనే గ్రామాన్ని గుర్తించిన గున్వంత్.. ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నాడు. ఆ గ్రామంలో బ్రిటీష్ కాలం నాటి చెరువు ఉన్నా… సిల్ట్ పేరుకుపోవడంతో అది ఉపయోగం లేకుండా పోయిందని తెలుసుకున్నాడు. నీటి సంరక్షణ పద్ధతులు, నీటి అక్షరాస్యతపై గ్రామస్థులకు అవగాహన కల్పించాడు. సకల్ ఫౌండేషన్ నుండి కందకాలు, కాలువలు మరియు కట్టలను నిర్మించడానికి, అలాగే సరస్సును సిల్ట్ చేయడానికి మరియు కాంక్రీట్ బ్యారేజీలను ఏర్పాటు చేయడానికి నిధులను పొందగలిగాడు గున్వంత్. శిథిలావస్థలో ఉన్న నీటి బ్యారేజీలు, చెక్‌డ్యామ్‌ల మరమ్మతు పనులను కూడా గ్రామస్తులు నిర్వహించారు.
మొత్తం ప్రయత్నాలు పరీవాహక ప్రాంతాల ద్వారా వర్షపు నీటిని నిలిపివేసి, చెరువుల వైపు మళ్లించడం మరియు భూగర్భ జలాలను తిరిగి నింపడంలో సహాయపడిందని గున్వంత్ చెప్పారు.2018 నాటికి, గ్రామస్తుల సహకారం 15 కోట్ల లీటర్లను ఆదా చేయడంలో సహాయపడిందని గున్వంత్ చెప్పారు. ఈ విజయం ఇచ్చిన నమ్మకంతో అదే తాలూకాలోని ఆబోనే తండా గ్రామంలో నీటి సంరక్షణ పనులు చేపట్టారు. రెండేళ్లలో నీటి సంరక్షణ పనుల ద్వారా మూడు సరస్సులను పునరుద్ధరించి నాలుగు చెరువులను సృష్టించినట్లు గున్వంత్ తెలిపారు. దీని వల్ల గ్రామస్థులు ప్రయోజనం పొందడం ప్రారంభించారని.. రైతుల ఆదాయం మూడు రెట్లు పెరిగిందని గున్వంత్ చెప్పారు.