Red Stripe on Medicines: Why is there a red stripe on the pill packet? What does this mean?
Red Stripe on Medicines: మాత్రల ప్యాకెట్‌పై ఎర్రటి గీత ఎందుకు ఉంటుంది? దీని అర్థం ఏంటి?
సాధారణంగా చాలా మంది అనారోగ్యానికి గురైతే వైద్యుల వద్దకు వెళ్లకుండా నేరుగా మెడికల్ స్టోర్‌కు వెళ్లి మాత్రలు తీసుకుని వాడుతుంటారు. కొన్నిసార్లు డాక్టర్ వద్ద చూపించుకుని రాసి మందులను తీసుకుంటారు. మీరు డాక్టర్ వద్దకు వెళ్లకుండా నేరుగా మెడికల్ స్టోర్‌కు వెళ్లి తీసుకున్న మందులు మీ సమస్యను నయం చేసినప్పటికీ, కొన్నిసార్లు మీరు తీవ్రమైన దుష్ప్రభావాలను అనుభవించవలసి ఉంటుంది. పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ మొదలైన తక్షణ నొప్పి నివారణను అందించే మాత్రలను కొనుగోలు చేసేటప్పుడు మాత్రల ప్యాకెట్‌పై ఎరుపు గీతలను మీరు గమనించి ఉండవచ్చు. అయితే ఈ ఎరుపు రంగు లైన్ ఎందుకు ఉంటుందో మీరెప్పుడైనా గమనించారా?
పిల్ ప్యాకెట్‌పై ఉన్న ఎరుపు గీత అర్థం ఏమిటి?
నిజానికి మాత్రల ప్యాకెట్‌పై ఉన్న రెడ్ లైన్ అంటే ‘డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మాత్రను అమ్మకూడదు లేదా డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు’. అందువల్ల, యాంటీబయాటిక్స్ దుర్వినియోగాన్ని నివారించడానికి, మందులపై రెడ్ లైన్ ఇస్తారు.
రెడ్ లైన్ కాకుండా, డ్రగ్‌పై చాలా ఉపయోగకరమైన విషయాలు రాసి ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని మందుల ప్యాకెట్‌పై Rx అని రాసి ఉంటుంది. అంటే వైద్యుల సలహా మేరకే మందులు తీసుకోవాలి. అలాగే కొన్ని మందుల ప్యాకెట్‌పై XRx అని రాసి ఉంటుంది. దీనర్థం ఔషధాన్ని డాక్టర్ మాత్రమే ఇవ్వవచ్చు. వైద్యుడు నేరుగా రోగికి ఈ మందును ఇవ్వవచ్చు. డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ ఉన్నా, రోగి దానిని ఏ మెడికల్ స్టోర్ నుంచి కొనలేడు.