Sensational decision of Revant Sarkar.. Jobs for all of them like in AP..! - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

Sensational decision of Revant Sarkar.. Jobs for all of them like in AP..!

24_03

 Sensational decision of Revant Sarkar.. Jobs for all of them like in AP..!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఏపీలో మాదిరిగా వాళ్లందరికీ ఉద్యోగాలు..!

Sensational decision of Revant Sarkar.. Jobs for all of them like in AP..! రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఏపీలో మాదిరిగా వాళ్లందరికీ ఉద్యోగాలు..!

తెలంగాణ మంత్రి వర్గం సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఓవైపు.. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండగా.. తెలంగాణ ప్రజల మద్దతు కూడగట్టుకునేలా ఆకర్షణీయమైన నిర్ణయాలు తీసుకుంది రేవంత్ సర్కార్. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ కేబినెట్ భేటీలో ముఖ్యమైన అంశాలపై చర్చించగా.. ప్రధానంగా 2008 డీఎస్సీ రాసిన వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌లో.. కీలక విషయాలపై సూదీర్ఘంగా చర్చించారు. పలు అంశాలు చర్చకు రాగా.. కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రి వర్గం. అందులో ప్రధానంగా.. 2008 డీఎస్సీ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఏపీలో ఇచ్చినట్టు ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 2008లో డీఎస్సీ క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఎస్జీటీ ఉపాధ్యాయ పోస్టులు రానున్నాయి. అయితే.. 2008లో 3500 ఎస్జీటీ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వేయగా.. పరీక్ష రాసి క్వాలిఫై అయ్యారు. అయితే.. ఆ నియమాకాలు చేపట్టకపోవటంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. కాగా.. ఆ అభ్యర్థులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు తీర్పు ఇవ్వటంతో.. 14 ఏళ్ల తర్వాత వారి నియామకాలు జరగనున్నాయి.

మరోవైపు.. 16 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు కూడా మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను మరోసారి రాజ్‌భవన్‌కు పంపించాలని తీర్మాణం చేసింది మంత్రి వర్గం.

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. మంత్రి వర్గం భేటీ కావటం సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల వేళ.. రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుందన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న రేవంత్ రెడ్డి.. మరిన్ని ఇంట్రెస్టింగ్ నిర్ణయాలతో ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. కేబినెట్‌లో కొత్తగా తెల్ల రేషన్ కార్డుల పంపిణీపై అంశంపై చర్చించినట్టు సమాచారం.

ఇక.. ఆరు గ్యారెంటీల్లో భాగంగా వరుసగా పథకాలు అమలు చేస్తున్న రేవంత్ సర్కార్.. మహిళలకు 2500 పథకం, కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఇవ్వటం, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలపై కూడా కేబినెట్ చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా.. పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించబోయే బహిరంగ సభలో.. ఈ మూడు పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు.. ఉద్యోగుల సమస్యలపై కూడా కేబినెట్‌లో చర్చించినట్టు సమాచారం. నాలుగు డీఏలకు గానూ రెండు డీఏలు విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రైతు భరోసా, రైతు రుణమాఫీ పథకాలపై కూడా మంత్రి వర్గం చర్చించినట్టు తెలుస్తోంది. ఇక.. ధరణి కమిటీ ఇచ్చిన నివేదికలపై కూడా కేబినెట్‌లో చర్చకు రాగా.. దీనిపై సిట్ విచారణ జరిపించాలా అన్నది కూడా చర్చించారు. ఇక.. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో.. తమ ప్రభుత్వ పాలనను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న అంశంపై కూడా మంత్రి వర్గం చర్చించింది.