New ration cards - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

New ration cards

24_03

 Good news for the people of Telangana.. Cabinet approves the issuance of new ration cards

తెలంగాణవాసులకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్‌ ఆమోదం.

Good news for the people of Telangana.. Cabinet approves the issuance of new ration cards తెలంగాణవాసులకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్‌ ఆమోదం.

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రి వర్గం.. కీలక అంశాలపై చర్చించింది. కాగా.. ఇందులో భాగంగా.. తెలంగాణ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీపై చర్చించిన కేబినెట్.. త్వరలోనే జారీ చేయాలని నిర్ణయించింది. మరోవైపు.. రైతు బంధుపై కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల్లో 93 శాతం రైతుబంధు చెల్లించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

తెలంగాణ వాసులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఎప్పుడెప్పుడు కొత్త రేషన్ కార్డులు వస్తాయని ఎదురుచూస్తున్న లక్షల మందికి రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేభినెట్ భేటీలో ప్రభుత్వం కీలక అంశాలపై చర్చించగా.. అందులో ప్రధానంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీపై చర్చించి కీలక నిర్ణయం తీసకుంది. కొత్త రేషన్ కార్డుల జారీ చేయాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో.. తెలంగాణలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి లబ్ది చేకూరనుంది.

అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్.. ఆరు గ్యారెంటీల్లో భాగంగా పలు పథకాలను అమలు చేస్తోంది. అయితే.. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలకు ప్రామాణికంగా రేషన్ కార్డునే తీసుకుంటుండటంతో.. చాలా మంది రేషన్ కార్డులు లేని వాళ్లు నిరాశకు గురవుతున్నారు. కాగా.. గత ప్రభుత్వం హయాంలో రేషన్ కార్డుల జారీ జరగకపోవటంతో.. చాలా మంది పెళ్లిళ్లు చేసుకోవటం, ఉమ్మడి కుటుంబాలు విడిపోవటం, కొంత మంది చనిపోవటం.. ఇలా చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. మొత్తంగా.. ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటంతో.. తెలంగాణ వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఎన్నాళ్లకెన్నాళ్లకు కొత్త రేషన్ కార్డుల జారీ జరుగుతోందన్న ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రైతు బంధుపై కేబినెట్ కీలక నిర్ణయం:

మరోవైపు.. రెండు రోజుల్లో 93 శాతం రైతుబంధు ఇవ్వాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే.. ఛత్తీస్ గఢ్‌తో విద్యుత్ కొనుగోళ్ల అంశంపైనా విచారణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక కాళేశ్వరంపై కూడా విశ్రాంత జడ్జి జస్టిస్ పీసీ చంద్రఘోష్ నేతృత్వంలో విచారణ జరిపించాలని నిర్ణయంచింది కేబినెట్. కాగా. 100 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని కమిటీకీ కేబినెట్ సూచించింది.

మహిళా రైతుబజార్ల ఏర్పాటుకు నిర్ణయం:

ఇదే కాకుండా.. కేబినెట్ భేటీలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రి వర్గం నిర్ణయించింది. మరోవైపు.. నిన్న ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా.. రాష్ట్రంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు గానూ రూ.22,500 కోట్ల మంజూరుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కాగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు కొత్త కార్పొరేషన్లు ఏర్పాట్లు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మహిళా రైతుబజార్లు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.