Notification for 3,035 Jobs in TSRTC Soon. - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

Notification for 3,035 Jobs in TSRTC Soon.

24_03

 Notification for 3,035 Jobs in TSRTC Soon

TSRTC Driver Jobs: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. TSRTCలో 3,035 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌.

Notification for 3,035 Jobs in TSRTC Soon TSRTC Driver Jobs: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. TSRTCలో 3,035 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)లో 3,035 పోస్టుల భర్తీ్కి రంగం సిద్ధం అవుతోంది. ఈ మేరకు ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా.. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఆర్టీసీలో గత పదేళ్లుగా కారుణ్య నియామకాలు కొత్తగా పోస్టుల భర్తీ లేకపోవడంతోపాటు.. ఏటా పదవీ విరమణలతో ఖాళీలు భారీగా పెరిగాయి. ఇప్పటికే తక్కువ సిబ్బంది ఉండటం వల్ల వారిపై పనిభారం పెరుగుతోంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కార్ ఏర్పడిన తర్వాత అమలులోకి వచ్చిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య 15 లక్షలకు పెరిగింది. ఆక్యుపెన్సీ రేషియో 65 శాతం నుంచి 100 శాతానికి చేరుకుంది. ఉన్న సిబ్బందికి తలకు మించిన భారంగా మారుతోంది. దీంతో అదనంగా పనిచేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

ఈ పోస్టుల భర్తీతో వేతనాల రూపంలో ప్రతి నెల రూ.8.40 కోట్లు, ఏడాదికి రూ.100.80 కోట్ల మేర ఆర్టీసీపై భారం పడనుంది. ఆర్టీసీ ప్రతిపాదన పోస్టుల్లో అత్యధికంగా డ్రైవర్‌ పోస్టులు ఉన్నాయి. మొత్తం పోస్టుల్లో ఇవి మూడింట రెండొంతులు ఉన్నాయి. కొత్తగా నియమించబోయే డ్రైవర్లకు వేతనాల కింద ఏడాదికి రూ.65.28 కోట్లు చెల్లించాల్సి వస్తుందని అంచనా. సర్వీసులో ఉండగా సిబ్బంది మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద ఆర్టీసీ ఉద్యోగాలు ఇస్తోంది. అలాగే దాదాపు 800 మందిని కండక్టర్లను కూడా కొత్తగా తీసుకునే యోచనలో ఉన్నారు. అయితే తాజా ప్రతిపాదనల్లో కండక్టర్‌ పోస్టులను ప్రతిపాదించలేదని సమాచారం. కాగా ఆర్టీసీలో ప్రస్తుతం 42 వేల మంది ఉద్యోగులు ఉండగా.. వీరిలో డ్రైవర్లు 14,747, కండక్టర్లు 17,410 ఉన్నారు.

పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు ఇలా..

డ్రైవర్‌ పోస్టులు: 2000

శ్రామిక్‌ పోస్టులు: 743

డిప్యూటీ సూపరింటెండెంట్‌ (మెకానిక్‌) పోస్టులు: 114

డిప్యూటీ సూపరింటెండెంట్‌ (ట్రాఫిక్‌) పోస్టులు: 84

డీఎం/ఏటీఎం/మెకానికల్‌ ఇంజనీర్‌ పోస్టులు: 40

అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (సివిల్‌) పోస్టులు: 23

మెడికల్ ఆఫీసర్‌ పోస్టులు: 14

సెక్షన్‌ ఆఫీసర్‌ (సివిల్‌) పోస్టులు: 11

అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులు: 6