TS PGECET 2024 - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

TS PGECET 2024

24_03

 TS PGECET 2024

తెలంగాణ పీజీఈసెట్‌ – 2024 నోటిఫికేషన్‌ విడుదల.. మార్చి 16 నుంచి దరఖాస్తులు ప్రారంభం.

TS PGECET 2024 తెలంగాణ పీజీఈసెట్‌ – 2024 నోటిఫికేషన్‌ విడుదల.. మార్చి 16 నుంచి దరఖాస్తులు ప్రారంభం.

2024-25 విద్యా సంవత్సరానికి గానూ వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు తెలంగాణ స్టేట్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌)-2024 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TSCHE) విడుదల చేసింది. పరీక్షను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్‌) నిర్వహించనుంది. పీజీఈసెట్‌ 2024లో వచ్చిన ర్యాంకు ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలు, అఫిలియేటెడ్‌ ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కాలేజీల్లో ఫుల్‌ టైం ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌, గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఫార్మ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 16 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు, పరీక్ష తేదీలు, కోర్సుల వివరాలు వంటి సమాచారం కింద చెక్‌ చేసుకోవచ్చు.

ఏయే విభాగాల్లో ప్రవేశాలు ఉంటాయంటే..

ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, బయో-టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్, ఫుడ్ టెక్నాలజీ, మెటలర్జికల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్, నానో టెక్నాలజీ, జియో-ఇంజినీరింగ్ అండ్‌ జియో-ఇన్ఫర్మాటిక్స్‌, మెకానికల్ ఇంజినీరింగ్, ఫార్మసీ, టెక్స్‌టైల్ టెక్నాలజీ.. మొత్తం 19 విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. తెలంగాణ స్టేట్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌)-2024లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఆయా కోర్సుల్లో ఫుల్‌ టైం ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌, గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఫార్మ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తారు.

తెలంగాణ పీజీఈసెట్‌-2024కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత కోర్సును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, బీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 10, 2024వ తేదీ వరకు ఎలాంటి ఆలస్యం రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.1100 , ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులు రూ.600 తప్పనిసరిగా చెల్లించాలి. హైదరాబాద్, వరంగల్‌లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ప్రవేశ పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) విధానంలో జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • తెలంగాణ పీజీఈసెట్‌ 2024 నోటిఫికేషన్‌ జారీ తేదీ: మార్చి 12, 2024.
  • ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: మార్చి 16 నుంచి మే 10 వరకు, 2024.
  • రూ.250 నుంచి రూ.5 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరి తేదీ: మే 14 నుంచి 25 వరకు, 2024.
  • హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ ప్రారంభ తేదీ: మే 28 నుంచి, 2024.
  • 19 సబ్జెక్టులకు ప్రవేశ పరీక్షలు: జూన్‌ 6 నుంచి జూన్‌ 9 వరకు, 2024.