UPSC EPFO Recruitment 2024
యూపీఎస్సీ ఈపీఎఫ్‌వోలో 323 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. డిగ్రీతో కేంద్ర కొలువు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో 323 పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల్లో యూఆర్ కేటగిరీకి- 132 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి- 32 పోస్టులు, ఓబీసీ కేటగిరీకి- 87 పోస్టులు, ఎస్సీ కేటగిరీకి- 48 పోస్టులు, ఎస్టీ కేటగిరీకి 24 పోస్టులు కేటాయించారు.
ఆసక్తి కలిగిన వారు మార్చి 27, 2024వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు స్టెనోగ్రఫీ (ఇంగ్లిష్ లేదా హిందీ) నైపుణ్యంకి సంబంధించిన సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
అభ్యర్ధుల వయసు కనిష్ఠంగా 18 ఏళ్లు, గరిష్ఠంగా యూఆర్/ ఈడబ్ల్యూఎస్‌లకు 30 ఏళ్లు, ఓబీసీలకు 33 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు 35 ఏళ్లు, పీడబ్ల్యూబీడీలకు 40 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో మార్చి 27, 2024వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.
దరఖాస్తు సమయంలో రూ.25 రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించవల్సి ఉంటుంది. మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
రిక్రూట్‌మెంట్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, అనంతపురం, హైదరాబాద్‌లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
ముఖ్యమైన తేదీలు ఇవే..
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 27, 2024.
ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ తేదీలు: మార్చి 28, 2024 నుంచి ఏప్రిల్ 3, 2024 వరకు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE